Friday, 4 June 2021

ప్రియుడ్నిపెళ్లాడిన యామీ గౌతమ్.. ఫొటోలు వైరల్

నువ్విలా, గౌరవం, యుద్ధం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన పీటలెక్కింది. ‘ఉరి ది సర్జికల్ స్ట్రైక్' చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్‌ను పెళ్లాడింది. కోవిడ్‌ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నేడు (శుక్రవారం) వీరి పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని యామీ గౌతమ్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'ఉరి' చిత్ర షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో అప్పటి నుంచి రిలేషన్‌లో ఉన్న ఆదిత్య ధర్‌- జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 'ఫెయిర్‌ అండ్‌ లవ్లీ' యాడ్‌తో పాపులర్ అయిన యామీ గౌతమ్.. టాలీవుడ్‌లో చివరిగా నితిన్‌ సరసన 'కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌'లో నటించింది. అయితే తెలుగులో ఆమెకు సరైన హిట్ లభించకపోవడంతో బాలీవుడ్‌కి చెక్కేసి.. ఇదిగో ఇలా దర్శకుడ్ని పెళ్లి చేసుకుని లైఫ్ సెటిల్ చేసుకుంది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్‌లో 'దస్వి', 'ఎ థర్స్‌డే' 'భూత్‌ పోలీస్‌' తదితర చిత్రాల్లో నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iim0WH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...