Saturday, 5 June 2021

పెళ్లి పీటలెక్కిన మరో టాలీవుడ్ యాక్టర్.. అంతా సైలెంట్‌గా కానిచ్చేసిన 'నాటకం' నటుడు

కరోనా లాక్ డౌన్ సమయంలో సినీ తారలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. గతేడాది నిఖిల్, నితిన్, రానా, నిహారిక పెళ్లి బంధంలోకి అడుగుపెట్టగా.. ఈ ఏడాది ప్రణీత సుభాష్, యామి గౌతమ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు వారి బాటలోనే 'నాటకం' హీరో సైలెంట్‌గా తన పెళ్లి తంతు ఫినిష్ చేసేశాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నిఖితను పెళ్లాడిన ఆశిష్‌ ఆమెతో ఏడడుగులు వేశాడు. గత నవంబరులో ఆశిష్‌ తల్లిదండ్రులు నిఖిత కుటుంబ సభ్యులను కలిసి పెళ్లి విషయమై చర్చించారు. ఇప్పుడు ముహూర్తం చూసుకొని ఆశిష్, నిఖితలను ఒక్కటి చేశారు. రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. కోవిడ్‌ నియమ నిబంధనల నేపథ్యంలో అతి కొద్దిమంది బంధుమిత్రులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. తన ప్రేమ, పెళ్లి విషయమై రియాక్ట్ అయిన ఆశిష్ గాంధీ.. ''రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో నన్ను చూసి నిఖిత ఇష్టపడింది. అప్పట్నుంచి మా ఫ్యామిలీ ఫంక్షన్స్‌ జరిగిన ప్రతిసారి నన్ను ఫాలో చేసింది. నిఖిత లవ్ మ్యాటర్ రివీల్ చేసినపుడు చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది'' అన్నాడు. అలాగే తమ వివాహం గురించి ఇంట్లోని పెద్దలు మాట్లాడుకుంటున్నప్పుడు నిఖిత చాలా థ్రిల్‌ అయిందని, కోరుకున్న వ్యక్తితోనే పెళ్లవుతుందని చాలా ఆనందపడిందని ఆశిష్ చెప్పాడు. తాను కోరుకున్న లక్షణాలున్న అమ్మాయి తన జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fPV1QK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...