Thursday, 3 June 2021

అందాల ఆరబోతలో పీక్స్.. ‘కంచె’లు తెంచుతోన్న ప్రగ్యా జైస్వాల్

కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అంతుకు ముందు కూడా కొన్ని సినిమాలు చేశారు. కానీ కంచె సినిమాతోనే గుర్తింపు వచ్చింది. మొత్తానికి క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాతో ప్రగ్యా జైస్వాల్‌ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ముద్రను వేసుకున్నారు. ఆ సినిమాతో లుక్స్ పరంగా, నటనపరంగా వంద మార్కులను సాధించేశారు. అయితే ప్రగ్యాకు ఆ తరువాత మళ్లీ ఆ స్థాయి విజయం దక్కకపోవడంతో రేసులో కాస్త వెనుకబడ్డారు. నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాలు ప్రగ్యా కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆఫర్లు బోలెడన్ని వచ్చినా సక్సెస్ మాత్రం చేరువ కాలేకపోయింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తుంటారు. హాట్ హాట్ ఫోటోలతో వెరైటీ కొటేషన్‌లతో రచ్చ చేస్తుంటారు. బికినీలో కనిపిస్తూ నెటిజన్లను కవ్విస్తుంటారు. తాజాగా అలానే దర్శనమివ్వడంతో అందరూ కళ్లప్పగించి చూస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు బాలయ్య చిత్రంలో చాన్స్ కొట్టేశారు. ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. బాలయ్య లాంటి స్టార్ హీరోతో నటించాలంటే కొద్దిగా భయంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి ప్రగ్యా మాత్రం ఇప్పుడు తన అందాల ఆరబోతతో కంచెలన్నీ తెంచేస్తోంది. స్విమ్ సూట్‌లో దర్శనమివ్వడంతో సోషల్ మీడియా మొత్తం వేడెక్కిపోతోంది. ప్రస్తుతం ప్రగ్యా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అఖండ టైటిల్ మోషన్ పోస్టర్ యూట్యూబ్‌లో క్రియేట్ చేసిన రికార్డుల గురించి తెలిసిందే. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రగ్యా చేస్తోన్న రెండోచిత్రమిది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T0qs1S
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...