పెళ్ళయిందంటే ప్రెగ్నెన్సీ మాట రావడం సర్వసాధారణమైన విషయమే. అయితే హీరోయిన్స్ పెళ్లి మ్యాటర్స్ ఎంతలా వైరల్ అవుతుంటాయో వారి ప్రెగ్నెన్సీ సంగతులు కూడా అంతకంటే ఎక్కువ షికార్లు కొడుతుంటాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ మ్యాటర్ తెరపైకి వచ్చింది. కాజల్ తొందరలో గర్భవతి కావాలని ఆమె చెల్లెలు, మాజీ హీరోయిన్ బలంగా కోరుకుంటోందట. నిజానికి ఇది పర్సనల్ మ్యాటర్ అయినా కాజల్ సన్నిహిత వర్గాల నుంచి ఈ విషయం లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్‌గానే తన ప్రియుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని పెళ్లాడింది కాజల్ అగర్వాల్. ఆమె పెళ్లి జరిగి కొన్ని నెలలు గడవడంతో కాజల్ ప్రెగ్నెంట్ కావాలని ఆమె చెల్లి నిషా అగర్వాల్ భావిస్తోందని, అందుకు బలమైన కారణం కూడా ఉందని టాక్ నడుస్తోంది. వయసులో చిన్నదైనా కాజల్ కంటే ముందే పెళ్లి చేసుకుంది నిషా. అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించిన నిషా.. పెళ్లి అనంతరం రిటైర్మెంట్ తీసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం నిషా అగర్వాల్ కొడుకు వయస్సు మూడేళ్లు. అయితే తన కొడుకుకు త్వరగా కజిన్ రావాలని, వాళ్లిద్దరూ కలసి ఆడుకోవాలనే కోరికతో కోసం నిషా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మరోవైపు కాజల్ మాత్రం వరుస సినిమాలకు కమిటవుతూ ఫుల్ జోష్‌లో ఉంది. దాన్నిబట్టి చూస్తే కాజల్ ఇప్పట్లో ప్రెగ్నెన్సీ ఆలోచన పెట్టుకోలేదనే విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆచార్య' మూవీలో నటిస్తున్న ఆమె, మరో రెండు సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gOtgY2
v
No comments:
Post a Comment