Sunday, 27 June 2021

సినీగడప తొక్కబోతున్న ఎన్టీఆర్‌ బావమరిది! గ్రాండ్‌గా నార్నే వారి అబ్బాయి ఆరంగేట్రం.. ఇదీ స్కెచ్

సినిమాల్లోకి వారసుల ఎంట్రీ అనేది కామన్. అయితే కొందరు స్టార్ హీరోల విషయంలో మాత్రం వారి వారి దగ్గరి రిలేషన్స్, సన్నిహితులు కూడా సినీగడప తొక్కుతుంటారు. ఇదే బాటలో జూనియర్‌ బావమరిది, ఆయన భార్య ప్రణిత సోదరుడు నితిన్‌ చంద్ర త్వరలోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త నార్నే శ్రీనివాస రావు కుమారుడే . నితిన్‌ని హీరోగా పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కొత్త నటీనటులకు ఇంట్రడ్యూస్ చేయడంలో మంచి ప్రావీణ్యం ఉన్న డైరెక్టర్ తేజ ఆయన్ను హీరోగా మన ముందుకు తీసుకొస్తున్నట్లు విన్నాం. అప్పట్లో గ్రాండ్ సక్సెస్ సాధించిన 'చిత్రం' సీక్వెల్‌తో నితిన్‌ను లాంచ్‌ చేయాలని భావిస్తున్నట్లు టాక్ నడించింది. అయితే తాజా సమాచారం మేరకు కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ సెట్ కాలేదని, దీంతో దీంతో మరో ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌తో తారక్‌ బావమరిదిని హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే యాక్టింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్న నితిన్ చంద్ర.. గత కొద్ది రోజులుగా కొన్ని కథలు వింటున్నారట. అయితే ఈ కథల ఎంపికలో ఎన్టీఆర్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారని, ఈ మేరకు రీసెంట్‌గా ఓ పేరున్న దర్శకుడు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారనే ప్రచారాలు ఊపందుకున్నాయి. సర్వ హంగులతో ఈ సినిమాను నిర్మించే బాధ్యతలను స్వయంగా నితిన్ చంద్ర తండ్రి తన భుజాలపై వేసుకోబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సో.. చూడాలి మరి ఈ నార్నే వారసుడిని ఎలా రంగంలోకి దింపుతారనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AdVMv8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...