Sunday, 6 June 2021

టాప్ లెస్ ఫోజులతో నటి అందాల జాతర.. అది చూసి రెచ్చిపోయిన నెటిజన్! ఏకంగా అలా అనడంతో..

ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. హీరోహీరోయిన్స్ తమ తమ సామాజిక ఖాతాల్లో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ముఖ్యంగా నేటితరం నటీమణులైతే అయితే ఆన్ లైన్ వేదికలపై అందాల జాతర నడిపిస్తుండటం చూస్తూనే ఉన్నాం. అయితే కొన్ని సందర్భాల్లో అలాంటి గ్లామర్ ట్రీట్ ఫొటోలు, వీడియోలపై నెటిజన్స్ ఊహించని కామెంట్స్ చేస్తుండటం కూడా కామన్ అయింది. తాజాగా ఉత్తరాది టీవీ నటి విషయంలో సరిగ్గా అదే జరగడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం తన హాట్ హాట్ ఫోటోషూట్స్ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది టీనా దత్తా. ఈ క్రమంలోనే రీసెంట్‌గా పోస్ట్ చేసిన ఓ ఫోటోషూట్‌లో అర్థనగ్నంగా కనిపించి హీటెక్కించింది టీనా. టాప్ లెస్ పోజులతో రచ్చ రచ్చ చేయడంతో అంతా షాకయ్యారు. అయితే ఈ ఫొటోస్ చూశాక కొందరు నెటిజన్స్ తమ తమ రొమాంటిక్ కామెంట్లకు పదును పెట్టేశారు. ఓ నెటిజన్ అయితే మరీ దారుణంగా కామెంట్స్ చేశాడు. ఇది చూసి టీనాకు చిర్రెత్తే కోపం వచ్చింది. వెంటనే ఆ కామెంట్లను స్క్రీన్ షాట్స్ తీసి.. తన మీద నోరుపారేసుకున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ట్యాగ్‌ చేస్తూ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసింది. దీంతో సదరు నెటిజన్ భయపడిపోయి దారికొచ్చాడు. వెంటనే ఆమెను సోదరిగా సంబోధిస్తూ సారీ చెప్పేశాడట. ప్రస్తుతం ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zeSIOX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...