Wednesday, 9 June 2021

పావులు కదుపుతున్న బన్నీ కూతురు.. ఆట రె‘ఢీ’.. బాప్ రే అనిపిస్తున్న వీడియో

స్టైలిష్ స్టార్ తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. ఖాళీ సమయం దొరికితే భార్య ఇద్దరు పిల్లలతో ఆయన సరదాగా గడుపుతుంటారు. ముఖ్యంగా ముద్దుల కూతురు అర్హతో కలిసి ఆయన చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీరిద్దరు కలిసి అల్లరి చేసే వీడియోలను అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తరచూ సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ వీడియోల తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె అర్హకు సంబంధించిన ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఈ వీడియోలో అర్హ చెస్ ఆడుతూ వారెవ్వా అనిపిస్తుంది. చెస్‌లోని అన్ని పావులను ఆమె క్రమ పద్దతిలో అమర్చి ఆటకు సై అంటోంది. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంత చిన్న వయస్సులోనే అర్హ చెస్‌లో పట్టు సాధించడాన్ని వాళ్లు అభినందిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయాకొస్తే.. అతను ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T8gBHb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...