Wednesday, 16 June 2021

చిత్రసీమలో విషాదం.. రామాయణం నటుడు చంద్రశేఖర్ కన్నుమూత

చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ‘రామాయణ్’ ధారావాహికతో మంచి గుర్తింపు పొందిన (98) క‌న్నుమూశారు. ఈ రోజు (బుధవారం) ఉదయం 7 గంటలకు తన నివాసంలో తుది శ్వాస విడిచినట్టు ఆయన తనయుడు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అశోక్ శేఖర్ మీడియాకు చెప్పారు. వయసు మీద పడటంతో అనారోగ్య సమస్యలు తలెత్తి నిద్రలోనే ఆయన మరణించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్ 1954లో ప్రముఖ దర్శకుడు శాంతారామ్ తెరకెక్కించిన ‘సురాగ్’తో వెండితెరకు పరిచమై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించారు. ‘కవి’, ‘మస్తానా’, ‘బసంత్ బహార్‌’, ‘కాలీ టోపీ లాల్ రుమాల్’, ‘గేట్ ఆఫ్ ఇండియా’, ‘ఫ్యాషన్‌’, ‘ధర్మ’, ‘డ్యాన్స్ డ్యాన్స్‌’, ‘లవ్ లవ్ లవ్’ తదితర సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. సుమారు 250కిపైగా చిత్రాల్లో చంద్రశేఖర్ నటించారు. 1964లో ‘ఛ ఛ ఛ’ సినిమాతో నిర్మాతగా, దర్శకుడిగా మారారు. 1966లో ‘స్ట్రీట్ సింగ‌ర్’ అనే సినిమాను రూపొందించిన ఆయన.. 70ల్లో ‘ప‌రిచ‌య్‌’, ‘కౌశిష్’, ‘ఖుష్బూ’, ‘మౌస‌మ్’ త‌దిత‌ర సినిమాలకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గానూ ప‌నిచేశారు. రామానంద్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన 'రామాయణ్' సీరియల్‌తో పలువురి ప్రశంసలందుకున్నారు. చంద్రశేఖర్ మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iN1wFM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...