Friday, 18 June 2021

జోరు మీదున్న కార్తీకేయ.. కొత్త సినిమా అప్డేట్‌తో రచ్చ!

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపును సంపాదించుకున్నారు. అలా బ్లాక్ బస్టర్ హిట్‌తో క్రేజ్ పెరిగిపోయింది. వరుసగా ఆఫర్లు వచ్చాయి. అలా అవకాశాలు ఉక్కిరి బిక్కిరి చేయడంతో ఎడా పెడా సినిమాలు చేసేశారు. కానీ ఏ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. కార్తికేయ కెరీర్‌కు ఉపయోగపడలేదు. అలా కార్తికేయ సరైన హిట్ కోసం ఎంతో తపిస్తున్నారు. అయితే కార్తికేయ మాత్రం పట్టుదలని విక్రమార్కుడిలా ఓ సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలా చివరగా చావు కబురు చల్లగా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఎన్నో అంచనాల నడుము వచ్చిన ఆ చిత్రం నిరాశ పరిచ్చింది. బస్తీ బాలరాజు అంటూ పూర్తి మాస్ లుక్కులోకి మారి ఓ ప్రయోగం చేశారు. కానీ అది కూడా వర్కవుట్ అవ్వలేదు. అలా కార్తికేయ తన కొత్త సినిమాలను మాత్రం లైన్‌లో పెడుతూనే ఉన్నారు. సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలా తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఇన్ని రోజులు లాక్డౌన్ వల్ల షూటింగ్‌లు మూలన పడ్డాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్‌లతో టాలీవుడ్ కళకళలాడుతోంది. ఈ క్రమంలో తన సినిమా అప్డేట్‌తో అందరి మొహంపై చిరునవ్వును తీసుకు రావడానికి ప్రయత్నిస్తామంటూ కార్తీకేయ తన సినిమా అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఆదివారం నాడు తన కొత్త సినిమా అప్డేట్ రాబోతోందంటూ హీరో కార్తికేయ పోస్ట్ వేశారు. కార్తికేయ కొత్త చిత్రానికి శ్రీ సారిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gz8dd4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...