Wednesday, 2 June 2021

వర్షంలో సురేఖావాణి కూతురు అలా! గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫుల్ ఎంజాయ్.. పండగ చేసుకుంటున్న నెటిజన్లు

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణికి సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్‌ని అమాంతం పెంచేసుకుంటూ ఆన్ లైన్ వేదికలపై రచ్చ రచ్చ చేస్తూ ఎప్పటికప్పుడు తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ వస్తోంది. అయితే సురేఖావాణితో పాటు ఆమె కూతురు కూడా ఆన్ లైన్ హంగామా షురూ చేసి ఓ రేంజ్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది. సినిమాలు చేయకపోయినా హీరోయిన్స్ రేంజ్ పాపులారిటీ పొందిన సుప్రిత ఈ మధ్యకాలంలో డాన్స్ పర్‌ఫార్‌మెన్స్‌తో ఇరగదీస్తోంది. గతంలో తల్లి సురేఖావాణితో కలిసి చిందులేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో వదిలిన సుప్రిత.. ఇప్పుడు సోలో పర్‌ఫార్‌మెన్స్‌తో సత్తా చాటుతోంది. తన సోషల్ మీడియా ఖాతాల్లో వరుస వీడియోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లను పరేషాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా డాబాపై వర్షంలో డాన్స్ చేస్తున్న ఓ వీడియో షేర్ చేసింది. దీనిపై 'వర్షం' అని ట్యాగ్ చేస్తూ ఇన్స్‌స్టాలో వదిలింది. ఇందులో గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది సుప్రిత. దీంతో ఈ వీడియో చూసి లైకుల వర్షం కురిపిస్తూ పండగ చేసుకుంటున్నారు నెటిజన్లు. భర్త సురేష్ తేజ మరణించిన తర్వాత కూతురు సుప్రితతో కలిసి ఒంటరిగానే ఉంటోంది సురేఖా వాణి. మొన్నామధ్య ఈమె రెండో పెళ్లి గురించి వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఖండించింది సురేఖ. అలాగే సుప్రిత కూడా తన తల్లి రెండో పెళ్లి వార్తలపై కాస్త సీరియస్ అయింది. మరోవైపు సుప్రిత సినీ రంగ ప్రవేశం గురించి ఎప్పటినుంచో చర్చలు నడుస్తున్నాయి. ఈ మధ్య సుప్రిత హవా చూస్తుంటే త్వరలోనే ఆమె ఎంట్రీ కన్ఫర్మ్ అనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fJs0G5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...