Sunday, 13 June 2021

నగ్నంగా యంగ్ హీరోయిన్.. కెమెరా ముందు ఆ సీన్ షూట్ చేసే సమయంలో! జనాల్లో ఇప్పుడిదే హాట్ ఇష్యూ

కెమెరా ముందు ఓ హీరోయిన్ నగ్నంగా పోజివ్వడం అంటే మామూలు విషయం కాదు. అది ఫోటో షూట్ అయినా, వీడియో అయినా ఎంతో జాగ్రత్త తప్పనిసరి. అయితే నేటితరం యంగ్ హీరోయిన్స్ మాత్రం ఇలాంటి వాటికి సై అంటే సై అంటున్నారు. ఇప్పటికే ఎందరో హీరోయిన్స్ న్యూడ్‌గా ఫొటోలకు పోజులిచ్చి హల్చల్ చేయడం చూశాం. ఇక వెండితెరపై గతంలో ‘ఆడై’ మూవీలో హీరోయిన్ అమలాపాల్‌ నగ్నంగా కనిపించి షాకిచ్చింది. తాజాగా అదే బాటలో మరో యంగ్ హీరోయిన్ వెళ్లిందనే టాక్ నడుస్తోంది. కోలీవుడ్ నటి ఇందుకు పూనుకుందట. జనాల్లో ఇప్పుడిదే హాట్ ఇష్యూగా మారింది. తమిళ చిత్రసీమలో గాయ‌నిగా, హీరోయిన్‌గా త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆండ్రియా. సెలెక్టెడ్ సినిమాలు ఎంచుకుంటూ కథా ప్రాముఖ్యత ఉన్న సినిమాల్లో నటిస్తున్న ఆమె ఓ సినిమా కోసం నగ్నంగా కెమెరా ముందుకొచ్చిందట. మిష్కిన్ దర్శకత్వంలో 2016లో విడుదలైన ‘పిశాసు’ మూవీకి సీక్వల్‌గా‌ ‘’ రాబోతోంది. కథ డిమాండ్ చేయడంతో ఈ సినిమాలో ఓ సీన్ కోసం ఆండ్రియా నగ్నంగా నటించినట్టు వార్తలు వస్తున్నాయి. కేవలం కొందరి సమక్షంలో ఈ సీన్ షూటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై కోలీవుడ్‌లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ చిత్రంలో పూర్ణ, రాజ్‌కుమార్‌, పిచ్చుమణిలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కార్తీక్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుంది. అతి త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SolgVD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...