Wednesday, 2 June 2021

ఆ పని చేయాలా? వద్దా?.. డైలామాలో మిల్కీ బ్యూటీ తమన్నా

మిల్కీ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. వర్కవుట్లతో వేడి పుట్టించడంలో తమన్నా ముందుంటారు. మిల్కీ బ్యూటీ తన అందాలను ప్రదర్శిస్తూ నెట్టింట్లో కాకరేపుతుంటారు. క్షణం తీరిక లేకుండా పలు ప్రాజెక్ట్‌లతో తమన్నా బిజీగా ఉన్నారు. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ దృష్ట్యా సినిమా షూటింగ్‌లన్నీ కూడా అటకెక్కాయి. అందుకే సెలెబ్రిటీలందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. అలా తమన్నా కూడా షూటింగ్‌లు లేక ఇంట్లోనే ఉంటున్నారు. తాజాగా తమన్నా ఓ పోస్ట్ చేశారు. మామూలుగా ఇంట్లోనే ఖాళీగా కూర్చుని ఉంటుంటే బోర్ కొడుతూ ఉంటుంది. ప్రతీ రోజూలానే దినచర్యలు సాగవు. ఇంట్లోనే కూర్చుండటం వల్ల సమయానికి జరగాల్సినవ్నీ జరగవు. నిద్రలేవడం దగ్గరి నుంచి ప్రతీ ఒక్క పనిలో మార్పులు ఉంటాయి. ఆఫీస్‌కి వెళ్లడం లేదా షూటింగ్‌లకు వెళ్లే రోజులో అన్నీ సమయానికి తగ్గట్టు జరుగుతుంటాయి. కానీ ఇలా ఇంట్లోనే ఉంటోన్న సమయంలో అయితే వాటిలో మార్పులు వస్తుంటాయి. ఇక బద్దకం కూడా ఎక్కువగా పెరిగిపోతుంటుంది. అలా తమన్నాకు కూడా బద్దకం పెరిగినట్టు కనిపిస్తోంది. స్నానం చేయాలా? వద్దా? అనే డైలామాలో ఉన్నానంటూ తమన్నా చెప్పుకొచ్చారు. లాక్డౌన్ ఇలా మార్చేసిందంటూ తమన్నా చెప్పుకొచ్చారు. షవర్ చేయాలా? వద్దా? అనేదే ప్రశ్న.. కన్ఫ్యూజన్, దయచేసి సాయం చేయండి.. లాక్డౌన్ డైరీస్ అనే హ్యాష్ ట్యాగ్‌లతో తమన్నా రచ్చ చేస్తున్నారు. తమన్నా ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ సరసన సీటీమార్ సినిమా, నితిన్ హీరోగా వస్తోన్న హిందీ రీమేక్ అంధాదున్ చిత్రంలో తమన్నా నటిస్తున్నారు. ఇక ఎఫ్ 3 సినిమాతో తమన్నా మళ్లీ నవ్వులు పూయించేందుకు రెడీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vELp0B
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...