Monday, 14 June 2021

ఆమెను బాగా మిస్ అవుతున్నానంటూ ప్రియాంక భర్త కామెంట్స్.. రొమాంటిక్ ఫొటోతో ఫీలింగ్స్ బయటపెట్టిన నిక్

అదేంటి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు దూరంగా ఉంటోందా? అనుకుంటున్నారు కదూ!. దూరంగా ఉండటమనేది నిజమే గానీ పర్మినెంట్ మాత్రం కాదు. గత కొద్దిరోజులుగా తన షూటింగ్ నిమిత్తం భర్త నిక్‌కి దూరమైంది ప్రియాంక చోప్రా. ఈ నేపథ్యంలో తాజాగా తన భార్యతో దిగిన ఓ రొమాంటిక్ ఫొటో షేర్ చేస్తూ అంతకన్నా రొమాంటిక్ కామెంట్ పెట్టాడు ప్రియాంక భర్త . తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌‌ని ప్రేమించి పెళ్లాడిన ప్రియాంక చోప్రా.. అతనితో చెట్టాపట్టేసుకు తిరగడం, పబ్లిక్ రొమాన్స్ చేస్తూ వార్తల్లో నిలవడం కామన్‌గా చూస్తున్నాం. ఏ మాత్రం సమయం దొరికినా ఈ ఇద్దరూ రొమాంటిక్ మూడ్‌లో తేలిపోతుంటారు. పబ్లిక్ గానే రొమాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుండటం ఈ జోడీ హాబీ. కెరీర్ పరంగా ఎంత బిజీ అయినా తన ప్రియుడు, భర్త నిక్ జోనాస్‌తో రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేయడంలో మాత్రం ఎప్పుడూ ముందుంటుంది ప్రియాంక. అలాంటిది ఓ టీవీ షో కోసం కొన్ని రోజులుగా లండ‌న్‌లో ఉంటోంది ప్రియాంక చోప్రా. అయితే తన భార్యతో ఏర్పడ్డ ఈ దూరాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తన ఫీలింగ్స్ బయటపెట్టారు నిక్ జోనాస్. చాలా రోజులుగా ప్రియాంక‌కు దూరంగా ఉంటున్న ఆయన.. ఆమెను బాగా మిస్ అవుతున్నట్లు పేర్కొంటూ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఈ మేరకు గతంలో ప్రియాంకతో కలిసి దిగిన ఓ రొమాంటిక్ పిక్ షేర్ చేశారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్లూ సారీలో ప్రియాంకను ఇలా రొమాంటిక్ మూడ్‌లో చూసి వావ్! బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pPL4Gg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...