Wednesday, 9 June 2021

Allu Arjun : మరో ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్.. బన్నీ కోసం వినూత్న దర్శకుడు ప్రయత్నం

సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఏ కాంబినేషన్ సెట్ అవుతుంది.. ఎప్పుడు ఏది క్యాన్సిల్ అయి మూలన పడుతుందో చెప్పలేం. అలా ఇప్పుడు విక్రమ్ కె కుమార్ ఓ స్టోరీ కోసం అల్లు అర్జున్‌ను పట్టేయాలని చూస్తున్నారట. ఇష్క్, 24, మనం వంటి వినూత్న సినిమాలతో ఆకట్టుకున్న విక్రమ్ కె కుమార్ గత కొంత కాలం నుంచి ఫాం కోల్పోయినట్టు కనిపిస్తోంది. ఆయన చివరగా తీసిన గ్యాంగ్ లీడర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. నానికి ఆ చిత్రం మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. అలా కాస్త గ్యాప్ తీసుకుని నాగ చైతన్యతో ఓ మూవీని ఫిక్స్ చేసుకున్నారు. సైలెంట్‌గా ఆ మూవీ షూటింగ్‌ను కానిచ్చేశారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాత్రలో నాగ చైతన్య కనిపించబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్‌ను ఇటలీలో పూర్తి చేసుకున్నారు. థాంక్యూ అంటూ రాబోతోన్న ఈ మూవీ తదుపరి షెడ్యూల్‌ను హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూట్ చేయబోతన్నట్టు టాక్. అయితే ఈ క్రమంలోనే విక్రమ్ కే కుమార్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారట. ఈ సందర్భంగా బన్నీకి ఓ ప్యాన్ ఇండియన్ సబ్జెక్ట్‌ను వినిపించారట. ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం కోసం తీవ్రంగా శ్రమిస్తోందట. మరి విక్రమ్ చెప్పిన కథకు బన్నీ ఓకే చెబుతారా? లేదా? అన్నది చూడాలి. బన్నీ ఇప్పుడు సుకుమార్‌తో పుష్ప సినిమా అంటూ బిజీగా ఉన్నారు. ఈ మూవీ తరువాత బన్నీ కొరటాల ప్రాజెక్ట్ పట్టాలెక్కేట్టుంది. ఆ తరువాత విక్రమ్ కే కుమార్ ప్రాజెక్ట్ ఉండే చాన్స్ ఉందని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cqUemY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...