Wednesday, 9 June 2021

Akhanda: బాలయ్య బర్త్ డే ట్రీట్ అదుర్స్.. నందమూరి ఫ్యాన్స్ గోల పెట్టే పోస్టర్ వదిలిన బోయపాటి

తమ అభిమాన హీరో పుట్టిన రోజు వస్తోందంటే చాలు.. కొత్త కొత్త అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు ఏ రేంజ్లో ఉంటాయో మనందరికీ తెలుసు. అలాంటిది బాలయ్య బాబు లాంటి టాప్ మోస్ట్ సీనియర్ హీరో పుట్టిన రోజంటే ఇక ఆయన అభిమాన వర్గాల ఆశలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా!. ఈ విషయం బాగా తెలిసిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. నందమూరి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయేలా ఓ పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసి వాళ్లందరిలో ఉన్న కుతులాహానికి రెక్కలు కట్టారు. జూన్ 10.. పుట్టిన రోజు కావడంతో ఆయన లేటెస్ట్ సినిమాల నుంచి వచ్చే సర్‌ప్రైజ్‌ల కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. దీంతో అందరూ ఎదురు చూస్తున్నట్లుగానే బోయపాటి శ్రీను ఒకరోజు ముందే రంగంలోకి దిగారు. బాలకృష్ణతో తాను రూపొందిస్తున్న కొత్త సినిమా '' నుంచి బాలయ్య బాబు సర్‌ప్రైజింగ్ లుక్ రిలీజ్ చేశారు. గతంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేసినా కూడా తాజా పోస్టర్‌లో మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉన్నారు బాలకృష్ణ. చుట్టూ లేడీస్ ఢమరుకాలు వాయిస్తుంటే మధ్యలో నుంచి స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తూ కనిపించారు బాలయ్య. రిలీజ్ చేసిన క్షణాల్లోనే ఈ పోస్టర్ వైరల్ అయింది. ఇది చూసి నందమూరి అభిమానులు ఖుషీ అవుతూ బాలయ్య బాబుకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ''సింహా, లెజెండ్'' లాంటి సూపర్ డూపర్ హిట్స్ తర్వాత బాలకృష్ణ- బోయపాటి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో 'అఖండ'పై బోలెడన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తుండటం సినిమాపై భారీ తీసుకొచ్చింది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wkfT8g
v

No comments:

Post a Comment