Monday, 28 June 2021

Acharya: ఈ సారి రామ్ చరణ్ వంతు.. యంగ్ హీరోయిన్‌తో చెర్రీ! మెగా అభిమానులకు సూపర్ కిక్..

రీ- ఎంట్రీ తర్వాత సక్సెస్‌ఫుల్ కథలతో అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి మరికొద్ది రోజుల్లో '' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సామాజిక కోణంలో కథలను సిద్ధం చేస్తూ ఆడియన్స్ మెప్పు పొందుతున్న కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి తనయుడు ఇందులో నిర్మాణ భాగస్వామిగా ఉంటూనే ముఖ్య పాత్ర పోషిస్తుండటం విశేషం. అయితే ఇప్పటికే ఈ మూవీ అప్‌డేట్స్‌తో మెగా అభిమానుల్లో ఉన్న అంచనాలకు రెక్కలు కట్టిన కొరటాల.. ఈ సారి రామ్ చరణ్‌తో మెగా కిక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు మెగా హీరోలతో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ప్లాన్ చేసిన కొరటాల శివ.. 'ఆచార్య' మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్ రెడీ చేశారట. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆడిపాడుతోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన, ఈ పాట తాలూకు లిరికల్ వీడియో విడుదల చేసేందుకు రెడీ అయ్యారట. జూలై నెలలో ఈ సాంగ్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చిరంజీవి 'లాహే లాహే' సాంగ్ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకున్న నేపథ్యంలో చెర్రీ సాంగ్ ఎలా ఉంటుందనే దానిపై అందరి దృష్టి పడింది. ఇకపోతే గతంలో ఎప్పుడూ లేని విధంగా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌తో 'ఆచార్య' మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎక్కడా తగ్గకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు కొరటాల. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది చిత్రయూనిట్. మణిశర్మ బాణీలు కడుతున్న ఈ భారీ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీపై లెక్కకట్టలేని అంచనాలు పెట్టుకుంది మెగా అభిమాన లోకం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jmuAnF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...