Sunday, 6 June 2021

బిగ్‌బాస్ 5 లేటెస్ట్ అప్‌డేట్‌.. ఇక ఆగేదే లేదు! ఇదీ అసలు మ్యాటర్..

కరోనా వచ్చింది.. కోటి తిప్పలు తెచ్చింది. ఆ శతకోటి తిప్పల్లో టీవీ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ తిప్పలు బిగ్ బాస్ వాయిదా. జూన్‌లో మొదలవ్వాల్సిన ఈ మెగా రియాలిటీ షో పోయినేడాది కరోనా కారణంగా సెప్టెంబర్‌కు వాయిదా పడింది. ఎలాగోలా చివరకు బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇచ్చింది. ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది బిగ్ బాస్‌కి ఎలాంటి అడ్డంకులు ఉండవని అనుకుంటున్న తరుణంలోనే కరోనా సెకండ్ వేవ్ దాడి షురూ అయింది. దీంతో ఈ ఏడాదైనా సరైన సమయానికి మొదలవుతుందేమో అనుకున్న బుల్లితెర ఆడియన్స్ ఆశలు గల్లంతయ్యాయి. మళ్ళీ బిగ్ బాస్ వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. కానీ ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండడంతో పోయిన ఏడాది లాగా సెప్టెంబర్ వరకు కాకుండా, సాధ్యమైనంత త్వరగా ఐదవ సీజన్ మొదలు పెట్టాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లను జూమ్ యాప్ ద్వారా ఇంటర్వ్యూ కూడా చేస్తున్నారని, పదిరోజులు లోపే కంటెస్టెంట్లను ఖరారు చేసి క్వారెంటైన్లో ఉంచి అటునుండి నేరుగా బిగ్ బాస్ 5 స్టేజి పైకి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారని వార్తలు చూస్తున్నాం. హోస్ట్ చేసిన గత రెండు సీజన్లకి మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ ఐదవ సీజన్ కూడా ఆయనకే హోస్టింగ్ బాధ్యతలను అప్పగించారు. కాకపోతే ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే.. ఇంకా బిగ్ బాస్ సెట్ కూడా సిద్ధం కాలేదట. కరోనా కారణంగా ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంతలో మరోసారి బిగ్ బాస్ 5 అంశం తెరపైకి రావడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TL4uQJ
v

No comments:

Post a Comment