Thursday, 13 May 2021

TNR కుటుంబానికి అండగా నిలుస్తున్న ఇండస్ట్రీ.. మరో దర్శకుడు ఆర్థిక సాయం

రెండో దశలో కరోనా మహమ్మారి భయంకరంగా వ్యాపిస్తోంది. ఈసారి కరోనా సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా బలిగొంటోంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు చాలా మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ప్రముఖ సినీ జర్నలిస్ట్, నటుడు TNR(తుమ్మల నరసింహారెడ్డి) కరోనా బారిన పడి తుదిశ్వాస విడిచారు. ఎన్నో ఇంటర్వ్యూలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రాణాలు కోల్పోవడంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ క్లిష్ట పరిస్థితిలో ఆయన కుటుంబానికి సినీ ఇండస్ట్రీ అండగా నిలుస్తోంది. TNR భార్య జ్యోతితో ఫోన్‌లో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి.. తక్షణ అవసరాల కోసం లక్ష రూపాయిలు ఆర్థిక సహాయం అందించారు. చిరంజీవి తర్వాత నటుడు సంపూర్ణేష్ బాబు రూ.50 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇలా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు TNR కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు TNR కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. TNR కుటుంబానికి ప్రతీ ఒక్కరు అండగా నిలిచిన సమయం ఇది అని మారుతి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. TNR కుటుంబానికి ఆయన రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొన్నారు. ‘‘TNR కుటుంబానికి మన కృతజ్ఞత చూపించాల్సిన సమయం ఇది. TNR నిన్ను మేము మిస్ అవుతున్నాము. కానీ, మీ కుటుంబానికి మేము అండగా నిలుస్తాము’’ అంటూ మారుతి ట్వీట్ చేశారు. ప్రస్తుతం మారుతి.. గోపిచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. Sama


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eIwBrS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...