Wednesday, 19 May 2021

Samantha: 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైలర్ రిలీజ్.. మొదటిసారి సమంత అలా! విడుదల తేదీపై క్లారిటీ

రెండేళ్ల క్రితం ఓటీటీ వేదికగా అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమైన హిందీ వెబ్‌ సీరీస్‌ 'ది ఫ్యామిలీ మ్యాన్'. ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' రూపొందింది. ఇందులో అక్కినేని కోడలు ప్రధాన పాత్ర పోషించింది. నిజానికి ఇది ఈ ఏడాది ఫిబ్రవరి 12న విడుదలకు రెడీ అయింది కానీ అనివార్య కారణాలతో వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేస్తూ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మనోజ్ భాజ్‌పాయ్, ప్రియమణిలతో పాటు సమంత అక్కినేని ఈ ట్రైలర్‌లో కనిపించారు. ట్రైలర్ చూస్తుంటే సీజన్ 1 కంటే సీజన్ 2 మరింతగా ఉత్కంఠగా ఉండనుందని తెలుస్తోంది. డీ గ్లామర్ అండ్ నెగిటివ్ రోల్‌లో సమంత కనిపిస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. మ‌నోజ్ బాజ్‌పాయ్ శ్రీకాంత్ అనే పాత్ర‌లో క‌నిపించ‌గా, సమంత సూసైడ్‌ బాంబర్‌గా కనిపించింది. ఇకపోతే ఇది సమంత డెబ్యూ వెబ్ సిరీస్ కావడంతో ఆమె అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' అమెజాన్ ప్రైమ్ లో జూన్ 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో ప్రియమణి, షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీంతో ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న సమంత అభిమానుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ypiFKU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...