Wednesday, 19 May 2021

RRR: తారక్ బర్త్ డే సర్‌ప్రైజ్ అదుర్స్.. నందమూరి ఫ్యాన్స్‌కి జక్కన్న స్పెషల్ ట్రీట్

నేడు (మే 20) తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే యంగ్ టైగర్ . దీంతో ఎప్పటిలాగే ఆయన బర్త్ డే సర్‌ప్రైజ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు రాజమౌళి. ఆయన లేటెస్ట్ మూవీ నుంచి కొమరం భీం స్పెషల్ లుక్ రిలీజ్ చేసి నందమూరి ఫ్యాన్స్‌ని హూషారెత్తించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కొమరం భీం ఇంటెన్స్ తెలిసేలా ఈ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నట్లు ముందుగానే చెప్పిన RRR టీం తాజాగా విడుదల చేసిన పోస్టర్‌తో అందరినీ ఆకర్షించింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హై వోల్టేజ్ లుక్కులో కనిపించారు. చేతిలో బల్లెం పట్టుకొని సీరియస్ ఫేస్‌తో కనువిందు చేశారు. ఈ పోస్టర్ చూశాక బాక్సాఫీస్ కటౌట్ అదిరింది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలాఉంటే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన కొమురం భీం టీజర్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ పరుగులు పెడుతోంది. తాజాగా వదిలిన ఎన్టీఆర్ లుక్‌తో ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ఎలా ఉంటుందో చూడాలనే ఆతృత జనాల్లో రెట్టింపయింది. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎప్పుడైతే ఈ మూవీ అనౌన్స్ అయ్యిందో అప్పటినుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. మరోవైపు ఎన్టీఆర్ కరోనా బారిన పడటం, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలంటూ ఆయన రిక్వెస్ట్ చేయడంతో ఆయన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరోకు పెద్ద ఎత్తున విషెస్ పోస్ట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3whCwtK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...