Thursday, 13 May 2021

Rajinikanth: షూటింగ్ ముగించుకొని చెన్నై వెళ్లిన తలైవా.. అక్కడ చేసిన తొలి పని ఏంటంటే..!

రెండో దశలో కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. ప్రతీ రోజు వైరస్ బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కరోనా నుంచి రక్షణ పొందాలంటే.. స్వీయ నియంత్రణ పాటించడంతో పాటు అర్హత ఉన్న వాళ్లందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి అర్హత ఉన్నవాళ్లందరికీ.. వ్యాక్సిన్ అందిస్తున్నారు. ప్రస్తుతం మూడో దశలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ పొందేందుకు అర్హులని ప్రకటించారు. అయితే వ్యాక్సిన్ కొరత ఏర్పడటంతో.. ప్రస్తుతానికి చాలా ప్రాంతాల్లో 45 సంవత్సరాలు నిండినవారికే వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకున్న సెలబ్రిటీలు ప్రతీ ఒక్కరు ఎటువంటి భయం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా సూపర్‌స్టార్ కూడా వ్యాక్సిన్ పొందారు. ఈ మధ్యే అన్నాత్తే షూటింగ్ ముగించుకొని చెన్నై వెళ్లిన ఆయన అక్కడ రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని రజనీకాంత్ కుమార్తె సౌందర్య ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘తలైవర్ వ్యాక్సినేటెడ్’ అనే హాష్‌ట్యాగ్‌ని దీనికి జత చేశారు. ఇక అన్నాత్తే సినిమా విషయానికొస్తే.. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. కీర్తీ సురేశ్, మీనా, కుష్బు, జాకీ ష్రాఫ్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నవంబర్ 4వ తేదీన విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3w7IpK7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...