Sunday, 9 May 2021

Liger: విజయ్‌ దేవరకొండ అభిమానులకు తప్పని నిరాశ.. అది మాత్రం గ్యారెంటీ అంటూ పూరి టీమ్ స్టేట్‌మెంట్

స్టార్ హీరోల పుట్టినరోజు వచ్చిందంటే అభిమానులకు అదో పండగ రోజు. ఆయా హీరోల లేటెస్ట్ మూవీల నుంచి ఏదోఒక అప్‌డేట్ రావడం పక్కా. ఈ నేపథ్యంలోనే నేడు (మే 9) విజయ్ దేవరకొండ పుట్టినరోజు కానుకగా ఆయన తాజా సినిమా 'లైగర్' నుంచి టీజర్ రిలీజ్ అవుతుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ టీజర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది పూరి యూనిట్. దేశంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టీజర్‌ విడుదల వాయిదా వేస్తున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది. ''దేశంలో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మీరంతా ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారని ఆశిస్తున్నాం. పవర్‌ప్యాక్డ్‌ సన్నివేశాలతో కూడిన ‘లైగర్‌’ టీజర్‌ని మే 9న విడుదల చేయాలని భావించాం. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న విపత్కర పరిస్థితులు చూశాక.. ఈ టీజర్‌ విడుదల వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే మరో కొత్త తేదీతో మీ ముందుకు వస్తాం. టీజర్ మాత్రం మీ అందరినీ మెప్పించడం గ్యారెంటీ'' అని పేర్కొంది లైగర్ యూనిట్. ‘సాలా క్రాస్‌ బ్రీడ్‌’ ట్యాగ్ లైన్‌తో మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రియాలిటీకి దగ్గరగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకొని తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీపై విజయ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h9o1E4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...