Thursday, 6 May 2021

K.G.F-2: మరో క్రేజీ అప్‌డేట్.. థియేటర్ల నుంచి త్వరగా బయటకు రావడం కష్టమేనట..!

కన్నడ సినిమా స్థాయిని యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం ‘’. దర్శకత్వంలో రాక్‌స్టార్ హీరోగా నటించిన ఈ చిత్రం మొత్తం ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఒక సినిమా ఇలా కూడా తీయొచ్చా అని దర్శక నిర్మాతలు అవాక్కయ్యేలా సినిమాని రూపొందిచాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. మాస్ ఫైట్లు, ఓ రేంజ్ ఎలివేషన్లతో సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కే.జీ.ఎఫ్-ఛాప్టర్ 2’ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగంలో చూసిన ప్రతీ ఒక్కరు ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక కొన్ని నెలల క్రితం విడుదలైన సినిమా టీజర్.. అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ టీజర్‌తో ఛాప్టర్ 2 సినిమా ఎలా ఉండబోతుందా అనే చిన్న ట్రయల్ చూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించి రోజుకో వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ట్రెండ్ అవుతోంది. అదేంటే.. సినిమాను ఎలాంటి కట్స్ లేకుండా.. 2 గంటల 53 నిమిషాల నిడివితో ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. అంతసేపు థియేటర్‌లో ప్రేక్షకులను కూర్చొబెట్టే స్క్రీన్‌ప్లే ఉన్న కారణంగానే సినిమాలను అలా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త ఎంతవరకూ నిజమనే విషయంలో క్లారిటీ లేదు. ఇక ఈ సినిమాతో ప్రధాన విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు నటిస్తున్నాడు. యశ్, సంజయ్ దత్‌ల మధ్య నడిచే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా ఉండనున్నాయనే టాక్ వినిపిస్తుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రవీనా టండన్, ప్రకాశ్ రాజ్, అనంత్ నాగ్, రావు రమేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది జూలై 16న సినిమాను విడుదల చేస్తామని తొలుత ప్రకటించారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో సినిమా విడుదల వాయిదాపడే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3b6XF1E
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...