Sunday, 23 May 2021

పెళ్లి సంద‌D: బుజ్జులు బుజ్జులు.. ఘాటు ఘాటు నాటు ముద్దులు.. రాఘవేంద్రుడి రొమాంటిక్ అప్‌డేట్

పాతికేళ్ల క్రిందట శ్రీకాంత్ హీరోగా 'పెళ్లి సందడి' సినిమాతో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.. ఇప్పుడు మోడ్రన్ '' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండటం విశేషం. రోషన్ సరసన శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి నేడు (మే 23) రాఘవేంద్ర రావు పుట్టిన రోజు కానుకగా రొమాంటిక్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ 'ప్రేమంటే ఏంటి' సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా.. నేడు సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘.. ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు’ అంటూ సాగిపోతున్న ఈ పాటలో విజువల్స్ చూస్తుంటే రాఘవేంద్రుడి మేకింగ్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తోంది. విడుదలైన కాసేపట్లోనే ఈ పాట వైరల్‌గా మారింది. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కె. కృష్ణమోహన్ రావు సమర్పిస్తుండగా మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నాటి ‘పెళ్లి సందడి’కి కొనసాగింపు చిత్రం కాదని ముందే చెప్పిన రాఘవేంద్రుడు ఈ సినిమాతో రికార్డులు తిరగరాయాలని చూస్తున్నారట. చిత్రంలో ప్ర‌కాశ్‌ రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యం రాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u75SJW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...