Friday, 14 May 2021

మాస్ మహరాజా ఫ్యాన్స్‌కి క్రేజీ న్యూస్.. ‘ఖిలాడి’ని ఎక్కడ చూడొచ్చంటే..!

‘రాజా ది గ్రేట్’ సినిమాతో మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన మాస్ మహరాజ .. ఆ తర్వాత వరుసగా నాలుగు ఫ్లాప్‌లు చవి చూశారు. అయితే ఈ ఏడాది విడుదలైన ‘క్రాక్’ సినిమాతో సూపర్‌హిట్ అందుకని మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు ఆయన. క్రాక్ సక్సెస్‌తో కాన్ఫిడెన్స్ పెరగడంతో వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు రవితేజా. అందులో దర్శకత్వంలో రూపొందుతున్న‘’ అనే సినిమా ఒకటి. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదల అయిన ‘ఖిలాడి’ టీజర్.. సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పరిస్థితులు మెరుగైన తర్వాత సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటికే వాయిదా వేశారు. అయితే సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత రిలీజ్ ఎలా ఉన్నప్పటికీ.. ఓటీటీల్లొ మాత్రం వచ్చేస్తుందని టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ సంస్థతో ఇందుకు సంబంధించి ఒప్పందం కూడా జరిగినట్లు తెలుస్తోంది. అంటే ఒకవేళ థియేటర్లలో విడుదల అయ్యే పరిస్థితి లేకుంటే సినిమాను నేరుగా అమెజాన్‌లోనే విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ‘ఖిలాడి’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో రవితేజా సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్జున్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై సత్యనారాయణ కోనేరు, రమేశ్ వర్మ ఈ సినిమాను సంయుక్తంగా నిరించారు. దేవి శ్రీ ప్రసాద్ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, టీజర్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yf1RGH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...