Tuesday, 25 May 2021

సాయి పల్లవి 'అనుకోని అతిథి' నిర్మాత కన్నుమూత.. మూవీ విడుదలకు ముందు విషాదం

ఓ వైపు కరోనా విలయతాండవంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు కన్నుమూస్తుండగా.. మరోవైపు అనారోగ్య సమస్యలతో మరికొంతమంది మరణిస్తుండటం సినీ లోకాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే నెలకొన్న విషాదాల నుంచి పూర్తిగా తేరుకోకముందే గత రాత్రి '' మూవీ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణ కుమార్ కన్నుమూశారని తెలియడం ఇండస్ట్రీ వర్గాల్లో విషాదం నింపింది. సాయి పల్లవి లీడ్ రోల్‌లో నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్‌ 'అనుకోని అతిథి' అనే సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత అన్నంరెడ్డి కృష్ణ కుమార్‌కు ఈరోజు (మే 26) ఉదయం గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆయన ప్రాణాలను కోల్పోయినట్లు తెలుస్తోంది. మే 28న ఆయన రూపొందించిన 'అనుకోని అతిథి' విడుదల కానున్న నేపథ్యంలో సరిగ్గా రెండు రోజుల ముందు కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఫహ‌ద్ ఫాజిల్, సాయి ప‌ల్ల‌వి జంటగా న‌టించిన మ‌ల‌యాళ సైకలాజికల్ థ్రిల్లర్‌ ‘అతిరన్‌’ను తెలుగులో 'అనుకోని అతిథి'గా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజ‌ర్, ట్రైలర్ విడుదల చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. వివేక్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, అతుల్ కుల‌క‌ర్ణి, రెంజి పానికర్‌, లియోనా లిషోయ్‌, శాంతికృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. జిబ్రాన్ సంగీతం అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yD4aDA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...