Thursday, 27 May 2021

ఆ డైరెక్టర్ అంటే నాకు అసూయ.. అందుకే ఫోన్‌లో అలా.. విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్

స్టార్ రైటర్ గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరేమో. రాజమౌళి తండ్రిగా విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు జాతీయస్థాయిలో ఫేమస్ అయ్యారు. ప్యాన్ ఇండియన్ రైటర్‌గా విజయేంద్ర ప్రసాద్ ఫుల్ బిజీగా ఉన్నారు. భజరంగీ భాయీజాన్, మణికర్ణిక, తలైవి వంటి సినిమాలకు కథ, కథనాలను అందించారు. అలా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. అలాంటి విజయేంద్ర ప్రసాద్ ఈ మధ్య మీడియాతో ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడిన మాటలు తెగ వైరల్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్‌కు మామూలుగా అయితే విజిల్స్ పడుతుంటాయి. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలో యాక్షన్ సీన్స్‌కు కన్నీళ్లు వస్తాయి. నేను వాటిని చూసి ఏడ్చాను.. దాదాపు ప్రతీ ఒక్కరూ కూడా నాలానే ఫీల్ అవుతారు అని ఆర్ఆర్ఆర్ గురించి విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. తాజాగా అలీతో సరదాగా షోలో గెస్ట్‌గా విచ్చేశారు. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తనకు ఇష్టమైన డైరెక్టర్ గురించి చెప్పుకొచ్చారు. రాజమౌళి కాకుండా మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? అని అలీ అడగడంతో అందరూ షాక్ అయ్యేలా ఆన్సర్ ఇచ్చారు. అంటే ఇష్టం.. ఆయనంటే నాకు అసూయ.. అందుకే ఫోన్‌లో ఇలా వాల్ పేపర్ పెట్టుకున్నాను అంటూ అందరూ ఆశ్చర్యపోయేలా చూపించేశారు. మొత్తానికి పూరి జగన్నాథ్ మామూలోడు కాదని మరోసారి ప్రూవ్ అయింది. ఇక విజయేంద్ర ప్రసాద్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చెబుతూ.. ఇప్పటికే ఈ మూవీ చూశాను. అద్భుతంగా వచ్చింది.. అలియా భట్ ఉన్న సీన్స్ కొన్నే అయినా.. ఆమె వచ్చాక ఎవ్వరూ కనిపించరు అని ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hXP9GA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...