Saturday, 15 May 2021

ఇలియానా సైడ్ బిజినెస్.. ప్రియుడితో బ్రేకప్ తర్వాత గోవా బ్యూటీ ఇలా! జనాల్లో కొత్త డౌట్స్

టాలీవుడ్ టు బాలీవుడ్ ప్రేక్షకులకు తన అందాల రుచి చూపించి ఫేమస్ అయిన గోవా బ్యూటీ సరికొత్తగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. హాట్ హీరోయిన్‌గా వెండితెరపై అలరిస్తూనే సోషల్ మీడియాలో హంగామా చేసే ఈ ముద్దుగుమ్మ.. మొదలు పెట్టబోతోందా? అనే టాక్ జనాల్లో ముదిరింది. ఈ మధ్యకాలంలో అమ్మడికి సినిమాలేవీ పెద్దగా కలసిరాకపోవడంతో ఇలాంటి స్టెప్ తీసుకుందని అంటున్నారు జనం. కొంతకాలం పాటు విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసిన ఇలియానా ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసింది. తిరిగి కెరీర్‌పై దృష్టి సారించి బాలీవుడ్ సహా దక్షిణాది లోనూ మరోసారి సత్తా చాటాలని ప్రయత్నాలు షురూ చేసింది. కానీ అవేవీ పెద్దగా వర్కవుట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. దీంతో ఇక లాభంలేదని సైడ్ బిజినెస్ ప్లాన్ చేసిందట ఇలియానా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె ఇందుకు సంబంధించి ఓ పోస్ట్ పెట్టడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ లాక్‌డౌన్‌లో కొత్త విష‌యాలు నేర్చుకునేందుకు ఆస‌క్తి చూపుతున్న ఇలియానా.. త‌న‌లోని చెఫ్‌ని బ‌య‌ట‌ పెట్టింది. వంటింట్లో గ‌రిటెపట్టి ప‌సందైన చాక్లెట్ కేక్‌ని త‌యారు చేసి ఆ హాట్ హాట్ కేక్‌ని ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. అంతేకాదు ఇది నాకు ప్ర‌త్యామ్నాయ కెరీర్ అవుతుంద‌ని భావిస్తున్నా అంటూ ఓ కొటేష‌న్ పెట్టేసింది. దీంతో ఎలాగూ సరైన అవకాశాలు లేవు కాబట్టి ఇలియానా ఇలా సైడ్ ట్రాక్ ఎక్కేసిందని చర్చలు షురూ అయ్యాయి. ఇక ఇలియానా సినిమా సంగతి అంటారా.. ఇటీవ‌ల 'ది బిగ్ బుల్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె త్వ‌ర‌లో 'అన్‌ఫెయిర్ అండ్ ల‌వ్లీ' సినిమాతో సంద‌డి చేయ‌నుంది. సో.. చూడాలి మరి ఇలియానాకు నిజంగానే సైడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తుందా? లేక సరదాగా అలా చెప్పిందా అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bxlj7A
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...