Wednesday, 12 May 2021

పట్టిస్తే లక్ష రూపాయల రివార్డ్.. నిధి అగర్వాల్ పోస్ట్ వైరల్

ఇస్మార్ట్ బ్యూటీ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. మొదటి రెండు చిత్రాలు వర్కవుట్ కాకపోయినా కూడా మూడో ఛాన్స్ కొట్టేశారు. అలా పూరి జగన్నాథ్ రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి దిశ మారింది. ఒక్కసారిగా నిధి అగర్వాల్ అందాలకు అందరూ ఫిదా అయ్యారు. అలా టాలీవుడ్‌లో నిధి అగర్వాల్‌కు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. అలా తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నిధి అగర్వాల్ మంచి ఆఫర్లతో దూసుకుపోతోన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సంక్రాంతి బరిలోకి రెండు చిత్రాలతో దిగారు. అలా శింబు ఈశ్వరన్, జయం రవి భూమి చిత్రాలతో నిధి అగర్వాల్ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక తెలుగులోనూ నిధి అగర్వాల్ భారీ ప్రాజెక్ట్‌లో ఆఫర్ కొట్టేశారు. పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్‌లో వస్తోన్న హరి హర వీర మల్లు చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక నిధి అగర్వాల్ గల్లా అశోక్ హీరోగా వస్తోన్న మూవీలోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక సినిమాలతోనే కాకుండా నిధి అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంటారు. అలా నిధి అగర్వాల్ తాజాగా ఓ పోస్ట్ చేశారు. అందులో ఓ పెట్ తప్పిపోయినట్టు చెప్పుకొచ్చారు. పట్టించి ఇస్తే లక్ష రూపాయల రివార్డ్ కూడా లభిస్తుందని నిధి చెప్పుకొచ్చారు. అందులో వారి కాంటాక్ట్ నెంబర్, పెట్ పేరు, మిగతా వివరాలన్నీ కూడా పొందుపరిచారు. మొత్తానికి కుక్క తప్పిపోయిందంటూ నిధి పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3obyz73
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...