దేశంలో వీరవిహారం చేస్తున్న కరోనా మహమ్మారి పలు కుటుంబాల్లో పెను విషాదం నింపుతోంది. కరోనా సెకండ్ వేవ్‌లో ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడం చూస్తున్నాం. మహమ్మారి తాకిడికి జనం అల్లాడిపోతున్నారు. భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ పరిస్థితుల్లో తన ఆత్మీయ వ్యక్తిని కోల్పోయిన హీరోయిన్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల ఇంట విషాదం మిగిల్చిన కరోనా వైరస్.. ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్ ఆవేదనకు కారణమైంది. ఆమె ప్రియుడు సౌరభ్ డింగ్రా తల్లి అనిత కరోనా కారణంగా కన్ను మూశారు. ఈ విషయాన్ని చెబుతూ పాయల్ ఎమోషనల్ అయ్యారు. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానంటూ మనసులోని బాధ వెళ్లగక్కారు. ''ఇకపై మీరు నా పక్కన ఉండకపోవచ్చు. కానీ నా హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటారు. కరోనా నుంచి బయటపడేందుకు ఎంతో పోరాడారు. కానీ మీ లాంటి వ్యక్తిని కోల్పోయాము. మిమ్మల్ని మేము ఎంతో మిస్ అవుతున్నాం అనితా ఆంటీ. మా అమ్మలానే మీరు కూడా నాపై ప్రేమ చూపించేవారు. నన్ను గారాబం చేసేవారు. నాకు కన్నీళ్లు ఆగడం లేదు. మిమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలని ఉంది. కానీ అందుకు అవకాశం లేదు కదా. అనితా ఆంటీ చివరగా చెప్పిన మాట ‘నాకు ఊపిరాడడం లేదు’. కరోనా అవకాశం ఉంటే నిన్ను అంతం చేసేస్తా'' అంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది పాయల్. Rx 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్.. మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ఫాలోయింగ్ పెంచుకుంది. ఇటీవలే ''వెంకీ మామ, డిస్కో రాజా'' సినిమాలతో అలరించిన ఆమె ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tQFfss
v
No comments:
Post a Comment