Sunday, 16 May 2021

అందరూ చూస్తుండగానే సుమతో నాని! ఆంటీ అంటూ వద్దన్నా వినకుండా.. దెబ్బకు బిత్తరపోయిన యాంకరమ్మ

తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమది సుదీర్ఘ ప్రస్థానం. తనదైన మాటల తూటాలతో, సమయానుసార పంచులతో ఎంతటి హీరోకైనా చుక్కలు చూపించే ఈ యాంకర్ తాజాగా మాటలు విని బిత్తరపోయింది. అందరిముందే నాని పిలుపు విని ఒక్కసారిగా షాకైపోయింది. కెమెరా ముందు పంచులతో పరేషాన్ చేసే సుమనే ఉక్కిరిబిక్కిరి చేసేశాడు నాచురల్ స్టార్. దీంతో దండం పెట్టి నేను వెళ్లిపోతున్నా బాబోయ్ అనేసింది . ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది.. అసలు మ్యాటర్ ఏంటి? అంటారా.. ఎంతమంది గ్లామరస్ యాంకర్లు రంగంలోకి దిగినా తన ప్లేస్ మాత్రం పదిలంగా ఉంచుకుంటున్న సుమ.. పలు బుల్లితెర షోలను హోస్ట్ చేస్తోంది. అద్భుతమైన టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. ప్రస్తుతం సుమ హోస్ట్‌గా చేస్తున్న షోలలో 'క్యాష్' ఒకటి. సినీ, టెలివిజన్ ప్రముఖులు గెస్టులుగా పిలిచి ఈ షోలో రచ్చ రచ్చ చేస్తుంటుంది సుమ. సెలబ్రిటీలతో కెమెరా ముందు ఈ యాంకరమ్మ చేసే సందడి అంతా ఇంతా కాదు. అయితే తాజా షోలో మాత్రం సీన్ రివర్స్ అయింది. నాచురల్ స్టార్ నాని సుమపై పంచులమీద పంచులు వేసేశాడు. మే 22న ప్రసారం కాబోతున్న సుమ 'క్యాష్' షోకు నాని '' టీమ్ మొత్తం గెస్టులుగా వచ్చారు. హీరోహీరోయిన్లు నాని, రీతూ వర్శలతోపాటు దర్శకుడు శివ నిర్వాణ ఈ షోలో పాల్గొన్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ వీడియోలో సుమ పరువుదీసేలా హీరో నాని మాట్లాడిన మాటలు హైలైట్ అయ్యాయి. 'సుమ ఆంటీ' అంటూ ఆమెను ఆటపట్టించాడు నాని. 'అమ్మాయిలకు ఆంటీ అని పిలిస్తే నచ్చదు' అని సుమ అనడంతో వెంటనే అందుకున్న నాని.. ''ఈ రోజు సుమ ఆంటీ షోకి రావడం నాకెంతో ఆనందంగా ఉంది. సుమ ఆంటీకి నేను వీరాభిమానిని. సుమ ఆంటీ అంటే నాకెంతో ఇష్టం'' అనేశాడు. అది విని షాకైన సుమ.. నేనెళ్ళిపోతున్నా అనేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ygHaKs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...