Sunday, 23 May 2021

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శ్రేయా ఘోషల్.. గతంలో ఎప్పుడూ లేని ఫీలింగ్ అంటూ ఎమోషనల్ కామెంట్స్

ప్రతి అమ్మాయి జీవితంలో తల్లి కావడం అనేది ఓ మధురమైన క్షణం. బిడ్డకు జన్మనిచ్చాక ఆ బిడ్డను చూసి మురిసిపోతూ తల్లి పొందే ఆనందాన్ని చెప్పడానికి మాటలు చాలవు. కాగా తాజాగా ఫేమస్ సింగర్ తాను తల్లినయ్యాననే గుడ్ న్యూస్ చెబుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది శ్రేయా. గర్భవతిగా ఉన్న సమయంలో తమ ఇంట్లోకి మూడో వ్యక్తి రాబోతున్నారని ప్రకటించిన శ్రేయా ఘోషల్.. తాజాగా తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చానని తెలిపింది. ''ఆ దేవుడి ఆశీర్వాదంతో పండంటి మ‌గ‌బిడ్డ పుట్టాడు. నేను, శైలాదిత్య‌ (ఆమె భర్త), కుటుంబ స‌భ్యులం అంద‌రం చాలా చాలా సంతోషంగా ఉన్నాం. గతంలో ఎప్పుడూ లేని ఫీలింగ్ ఇది. మా చిన్నారికి ఆశీర్వాదాలు పంపిన మీ అంద‌రికీ హృదయపూర్వక ధ‌న్య‌వాదాలు'' అంటూ ఆమె ఓ పోస్ట్ పెట్టారు. ఇది చూసి కంగ్రాట్స్ అంటూ పెద్దఎత్తున నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2015 సంవత్సరంలో శ్రేయా ఘోషల్ వివాహం జరిగింది. తన స్నేహితుడు, బిజినెస్‌మెన్ శైలాదిత్య‌ను ఆమె పెళ్లాడింది. వివాహం తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తున్న శ్రేయా.. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, బెంగాలీ భాషల్లో పాటలు పాడుతూ పలువురి ప్రశంసలందుకుంటోంది. ఇటీవలే 'ఉప్పెన' మూవీలో ఆమె పాడిన ''జల జల పాతం నువ్వు..'' సాంగ్ యూత్ ఆడియన్స్‌ని యమ అట్రాక్ట్ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/345T7EZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...