తన తొలి చిత్రం నుంచి ఇప్పటివరకూ అదే అందాన్ని మెయిన్‌టేన్ చేస్తూ.. కుర్రాళ్ల మనస్సు దోచుకుంటుంది మిల్కీ బ్యూటీ తమన్నా. కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. మంచి నటన, అద్భుతమైన డ్యాన్స్ ఇలా తమన్నాలో లేని క్వాలిటీ లేదు అనడంలో అతిశయోక్తి లేదు. స్క్రీన్‌పై కనిపించింది అంటే థియేటర్లలో ఈలల మోత మోగాల్సింది. ఆమె గ్లామర్ చూసి ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరు. దాదాపు 14 సంవత్సరాల క్రితం వెండి తెరపై అడుగుపెట్టిన ఈ భామ.. అప్పటి నుంచి స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతుంది. ఇప్పుడు తమన్నా రూటు మార్చాలనే ప్లాన్‌లో ఉందట. ఇక తెరపై గ్లామర్ డోస్‌కి స్వస్తి చెప్పి.. డిఫెరంట్ జోనర్లలో సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం తమన్నా.. ‘ఎఫ్’ ఒకటే పెద్ద సినిమా అని చెప్పుకోవచ్చు. మిగితా సినిమాలు అన్ని చిన్న హీరోల సినిమాలే. మరోవైపు పలు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తోంది తమన్నా. ఇప్పుటికే ‘ఆహా’లో రూపొందిన ‘లెవన్త్ అవర్’ అనే వెబ్‌సిరీస్‌తో మంచి మార్కులే కొట్టేసింది. త్వరలో ‘హాట్‌స్టార్’లో వచ్చే ‘నవంబర్ స్టోరీ’తో పాటు ఇతర ఓటీటీలతో మరో రెండు వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తుందని టాక్. అయితే ఈ రూటు తమన్నాకు చాలా సులభంగా అనిపిస్తుందట. ప్రస్తుతం ఉన్న హీరోయిన్ల తాకిడి తట్టుకొని నిలబడాలంటే ఈ టైప్ సినిమాలు చేయడమే కరెక్ట్‌ని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొంతకాలం గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ.. క్రైమ్ థ్రిల్లర్లు, హారర్ థ్రిల్లర్లు, సన్సెస్ సినిమాలు చేయాలని ఆమె డిసైడ్ అయిందట. ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని తమన్నా భావిస్తున్నట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. మరి ఇదే కరెక్ట్ అయితే.. తమన్నా గ్లామర్ కోసం థియేటర్లకు వెళ్లే కుర్రాళ్లకు నిరాశే ఎదురవ్వక తప్పదు మరీ.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QSokZl
v
No comments:
Post a Comment