Tuesday, 25 May 2021

లైవ్‌లో ఫోన్ నెంబర్ ఇచ్చేసిన శ్రీముఖి.. స్టార్ హీరోను చూపిస్తూ పెళ్లిపై క్రేజీ ఫీలింగ్స్!!

ఈ రోజుల్లో హీరోయిన్ల కంటే ఎక్కువ హంగామా బుల్లితెర యాంకర్లదే కనిపిస్తోంది. సోషల్ మీడియాను ఫుల్లుగా వాడేస్తూ పాపులర్ అవుతున్నారు యంగ్ యాంకర్స్. ఎప్పటికప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేయడం, అందాల తలపులు తెరుస్తూ హాట్ హాట్ ఫొటోషూట్స్ పోస్ట్ చేయడం హ్యాబీగా పెట్టుకొని ఆన్ లైన్ తెరలపై రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ లిస్టులో శ్రీముఖిది ఫస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సామాజిక మాధ్యమాల్లో రాములమ్మ హంగామా మాములుగా ఉండదు. ఈ నేపథ్యంలోనే తాజాగా లైవ్ చిట్ చాట్ చేసి ఏకంగా ఫోన్ ఫోన్ నెంబర్ ఇచ్చేసింది . ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలు ఇండియాలో బ్యాన్ కాబోతున్నాయని వార్తలు రావడంతో వెంటనే లైవ్ లోకి వచ్చింది శ్రీముఖి. మీరు ఏం అడగాలనుకుంటున్నారో ఓపెన్‌గా అడిగేయండి అంటూ ఆఫర్ ఇవ్వడంతో నెటిజన్స్ రెచ్చిపోయారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ బ్యాన్ అయితే మీతో మాట్లాడటం ఎలా అక్కా? ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వొచ్చుగా అని ఓ నెటిజన్ అడిగాడు. దీంతో వెంటనే 'ఒక్కడు' సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఫోన్ నెంబర్ ఇస్తున్న వీడియో పోస్ట్ చేసింది శ్రీముఖి. ఈ వీడియోలో 9848032919 నెంబర్ చెప్పాడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఇకపోతే ముందు సినిమాల్లో నటించి ఆ తర్వాత బుల్లితెర హవా నడిపిస్తున్న శ్రీముఖి.. బిగ్ బాస్ హౌస్‌లో చేసిన రచ్చ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. నాగార్జున హోస్ట్ చేసిన ఈ షోలో రన్నరప్‌గా నిలిచింది రాములమ్మ. అయితే తాజా చిట్ చాట్‌లో అదే నాగార్జునను వాడేస్తూ పెళ్లిపై తన ఫీలింగ్స్ బయటపెట్టేసింది. నన్ను పెళ్లి చేసుకో శ్రీముఖి అని ఓ నెటిజన్ అడిగితే.. ''వద్దురా సోదర పెళ్లంటే నూరేళ్ళ మంటారా'' అనే సాంగ్‌తో తన ఫీలింగ్స్ బయటపెట్టింది రాములమ్మ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oXwSKT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...