Wednesday, 12 May 2021

కరోనా నుంచి బయటపడ్డ అల్లు అర్జున్.. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలంటూ బన్నీ పోస్ట్

కొద్దిరోజుల క్రితం బారిన పడిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ తాజాగా కోలుకున్నారు. తనకు కొవిడ్ నెగిటివ్ వచ్చిందని వెల్లడిస్తూ ఆయన ట్వీట్ పెట్టారు. 15 రోజుల తర్వాత కోవిడ్ టెస్ట్ చేపించుకోగా నెగిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. ఇన్ని రోజులు తన ఆరోగ్యం గురించి ప్రార్ధించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అంటూ బన్నీ ట్వీట్ చేశారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో కరోనా కేసులు తగ్గే అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. అల్లు అర్జున్‌కి కరోనా నెగెటివ్ అని తెలిసి ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది గుడ్ న్యూస్, ప్లాస్మా దానం చేయండి అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ పెడుతుండగా.. మీకు నెగెటివ్ రావడం ఆనందంగానే ఉంది కానీ జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారినపడటం బాధగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు ఇంకొందరు నెటిజన్లు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' మూవీలో నటిస్తున్నారు . ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. భారీ రేంజ్‌లో పాన్ ఇండియా మూవీగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. పల్లెటూరు అమ్మాయిగా ఆమె డిఫరెంట్ లుక్‌లో కనిపించనుంది. ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33z2FYI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...