Sunday, 9 May 2021

ఆ పాత్రతో థమన్‌ని పోల్చిన నెటిజన్.. ‘నీ భార్యతో అలా చెప్పు’ అన్న మ్యూజిక్ డైరెక్టర్

సోషల్‌మీడియాలో సెలబ్రిటీలపై ట్రోలింగ్ అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా జరుగుతున్న విషయమే. వెండితెర స్టార్ హీరోల నుంచి బుల్లితెర నటుల వరకూ ఎవరూ ఈ ట్రోలింగ్‌కి మినహాయింపు కాదు. అయితే కొందరు సెలబ్రిటీలను మాత్రం అదే పనిగా ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు. సదరు సెలబ్రిటీ ఏదైనా పోస్ట్ చేసినా.. ఏదైనా కామెంట్ చేసినా.. వెంటనే రియాక్ట్ అవుతుంటారు. అలా ఉన్న దానికి.. లేని దానికి ట్రోలింగ్ ఎదురుకొనే సెలబ్రిటీల్లో మ్యూజిక్ డైరెక్టర్ ఒకడు. థమన్ ఓ పాట రిలీజ్ చేసినా.. ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినా.. అందులో ఏం తప్పు దొరుకుంతుందా ఎలా ట్రోల్ చేద్దామా అని ఎదురుచూసే వాళ్ల సంఖ్య తక్కువేమీ లేదు. అయితే ఈ ట్రోల్స్‌లో కొన్ని నవ్వుకొనేలా ఉంటే.. మరికొన్ని మరీ హర్టింగ్‌గా ఉంటాయి. అయితే మామూలుగా ఉండే ట్రోల్స్‌కి ఎవరికీ రియాక్ట్ అవ్వాలని అనిపించదు. కానీ, వ్యక్తిగతంగా అదే పనిగా ట్రోల్ చేస్తే కచ్చితంగా ఎవరైనా రియాక్ట్ అవుతారు. లేటెస్ట్‌గా థమన్ విషయంలోనూ ఇదే జరిగింది. నాగార్జున నటించిన కింగ్ సినిమాలో బ్రహ్మానందం ‘జయసూర్య’ అనే మ్యూజిక్ డైరెక్టర్ పాత్రలో కనిపిస్తారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ప్రతీ ట్యూన్‌ని కాపీ కొడుతూ.. తనవిలా బిల్డప్ ఇస్తుంటాడు. అలాగే థమన్ కూడా ట్యూన్‌లు కాపీ కొడతాడు అంటూ చాలా మంది మీమ్స్ చేశారు. లేటెస్ట్‌గా ఓ నెటిజన్.. సదరు జయసూర్య పాత్రతో థమన్‌ని పోలుస్తూ.. ‘ఈయనే అని నా పిల్లలకు చెబుతాను’’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై థమన్ రియాక్ట్ అయ్యాడు. ‘‘దాంతో పాటు నువ్వు మీమ్స్ చేయడంలో బిజీగా ఉంటావని నీ భార్యకు చెప్పు. ఆమె నీలాంటి పనికిరాని మీమర్ పెళ్లి చేసుకున్నాను అని ఎంతో గర్వపడుతుంది’’ అంటూ థమన్ దీనికి కౌంటర్ ఇచ్చాడు. థమన్ ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తెలుగులో క్రాక్, వకీల్‌సాబ్ సినిమాలకు అతను అందించిన మ్యూజిక్ సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం అతను బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ’, వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘గని’ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uBXnYu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...