Monday, 24 May 2021

ఇకపై మెడికల్ కాలేజీల్లో ఆనందయ్య సిలబస్! కోవిడ్ మందుపై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ రియాక్షన్

ఓ వైపు కరోనా విలయతాండవం.. మరోవైపు ఆయుర్వేద మందు.. ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు వేరే రాష్ట్రాల్లోనూ ఆనందయ్య పేరు మారుమోగుతోంది. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు, శాత్రవేత్తలకే అంతుచిక్కని కరోనా మహమ్మారి.. ఆనందయ్య మందుతో తోకముడుస్తోందని నడుస్తున్న చర్చలు ఎల్లలు దాటుతున్నాయి. దీంతో ఈ ఇష్యూపై వరుస ట్వీట్స్ చేస్తూ సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందు ఇస్తున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ జనం మాత్రం ఎగబడుతున్నారు. బతుకు జీవుడా అంటూ ఐసీయూల్లో ఉన్న పేషేంట్స్ కూడా కృష్ణపట్నం బాట పట్టడం చూసాం. మరోవైపు జనం కూడా ఆనందయ్యను ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. దీంతో పలువురు రాజకీయ వేత్తలు, ఎమ్మెల్యేలు కూడా రియాక్ట్ కాగా.. వర్మ మాత్రం తనదైన కోణంలో ఆనందయ్యపై వైద్యంపై ట్వీట్స్ పెడుతున్నారు. గవర్నమెంట్ ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించలేదా? ఆయనకు ఇంకా మిలటరీ సెక్యూరిటీ కల్పించలేదా? అంటూ ఇప్పటికే ఆనందయ్యపై ఓ రేంజ్‌లో సెటైర్స్ వేసిన వర్మ.. ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీల్లో కూడా ఇకపై ఆనందయ్య సిలబస్ పెట్టేస్తున్నారా? అంటూ మరో సెటైరికల్ కామెంట్ వదిలారు. అంతేకాదు ఎయిమ్స్, కేర్ ఆసుపత్రుల పేర్లు ఆనందయ్య ఆసుపత్రులు అని మారుస్తున్నారట కదా!. నేను విన్నది నిజమేనా? అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. దీంతో వర్మ ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారి పలు చర్చలకు తెరలేపుతున్నాయి. వర్మ తీరుపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yBxREQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...