Monday, 3 May 2021

మేడ మీద భర్తతో కలిసి రచ్చ.. అలా హత్తుకుని మరీ కాజల్ హల్చల్

తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎన్నో ఏళ్ల నుంచి స్నేహితులుగా ఉన్న ఈ జోడి గతేడాది వివాహా బంధంతో ఒక్కటైంది. కాజల్ పెళ్లి దేశం మొత్తం మాట్లాడుకునేంతలా జరిగింది. కరోనా ఉన్నా కూడా ముంబైలో అత్యంత సన్నిహితుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. కాజల్ పెళ్లి వేడుకలు దాదాపు వారం రోజుల పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇక మాల్దీవుల్లో కాజల్ హనీమూన్ వ్యవహారం కూడా తెగ వైరల్ అయింది. అండర్ వాటర్‌తో భర్తతో కాజల్ చేసిన విన్యాసాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇక కాజల్ తన భర్త వ్యాపారానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. హోమ్ డెకర్స్‌లో కొత్త స్టైల్, కొత్త రకాలను తీసుకొస్తున్నామంటూ ఇచ్చిన యాడ్‌లో కాజల్ గౌతమ్ హల్చల్ చేశారు. అయితే ఇప్పుడు కాజల్ ఇంట్లోనే ఉంటున్నారు. కరోనా వల్ల అన్ని షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో కాజల్ ముంబైలో తన నివాసంలో భర్తతో కలిసి రచ్చ చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం కరోనా గురించి, ప్లాస్మా దానం గురించి వివరిస్తూ ఓ పోస్ట్ చేశారు. అందులో కాజల్ పక్కనే ఉన్నారు. ఇద్దరూకూడా మాస్కులు ధరించే కనిపించారు. కానీ తాజాగా కాజల్ ఓ పోస్ట్ చేశారు. ఇందులో మాత్రం తన భర్తను ఘాడంగా హత్తుకున్నారు కాజల్. ఈ మేరకు భర్తపై ప్రేమను కురిపించారు. ఏ భార్యకైనా తన భర్తే సర్వస్వం. అలానే కాజల్‌కు గౌతమ్ లోకమైనట్టున్నారు. గౌతమ్ తన సపోర్ట్ సిస్టమ్ అంటూ మేడ మీద రచ్చ చేశారు. ఘాడంగా హత్తుకున్న ఫోటోను కాజల్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాజల్ ప్రస్తుతం ఆచార్య చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PP5p0Y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...