Wednesday, 12 May 2021

కాబోయేవాడు అలా ఉండాలి.. అది ఎక్కువ చేయకూడదు.. సురేఖావాణి కూతురు కామెంట్స్

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ , ఆమె కూతురు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంటారు. మోడ్రన్ తల్లీ కూతుళ్లిద్దరి హవా చూసి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. సుప్రితకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే సుప్రితకు ఎక్కువగా నెగెటివిటీయే ఎదురువుతుంటుంది. ఆమె వేసుకునే డ్రెస్సులు, వెకేషన్స్‌లో ఎంజాయ్ చేసే తీరు, సోషల్ మీడియాలో చేసే స్పెల్లింగ్ మిస్టేక్‌లు అన్నీ కూడా ట్రోలింగ్‌కు గురవుతుంటాయి. అయితే తాజాగా సుప్రిత తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేందుకు లైవ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో ఎన్నో ప్రశ్నలకు సుప్రిత సమాధానం ఇచ్చారు. అభిమానులు హాయ్ అంటూ పదే పదే మెసెజ్‌లు పెడుతుండటంతో బోర్ కొడుతోందని సుప్రిత వాపోయారు. ఏదైనా ప్రశ్నలు అడగండి సమాధానం చెబుతాను అంటూ సుప్రిత తన ఫాలోవర్లను కోరారు. అలా సుప్రిత ఆఫర్ ఇవ్వడంతో నెటిజన్లు తమ మెదడుకు పదును పెట్టారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రశ్నలు వేశారు. ఫోన్‌లో ఏ యాప్స్ వాడుతావ్? ఖాళీగా ఉంటే ఏం చేస్తావ్? మీ నాన్న గురించి ఏమైనా చెప్పు? ఆయన ఎలా చనిపోయారు? ఇలా రకరకాల ప్రశ్నలు సంధించారు. ఇక బాయ్ ఫ్రెండ్, ప్రేమ, పెళ్లి, హీరోయిన్ ఎంట్రీపైనా ప్రశ్నలు వేశారు. అందులో సుప్రిత తన పెళ్లి గురించి చెప్పిన సమాధానాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఎలాంటి వాడు రావాలని కలలు కంటున్నావ్ అని ఓ నెటిజన్ అడిగాడు. నాకు పెద్దగా కోరికలేవీ లేవు గానీ.. ఓవర్ థింకింగ్ ఉండకూడదు..ఎక్కువగా ఆలోచించకూడదు.. నా పిచ్చిని భరించే వాడై ఉండాలి అంటూ తన కలల రాకుమారుడి గురించి సుప్రిత చెప్పుకొచ్చారు. ఇక పెళ్లి ఎప్పుడు అని కొందరు అడగడంతో అసలు విషయం బయట పెట్టేశారు. ఇంకా రెండు మూడు ఏళ్లు పడుతుందని సుప్రిత తన పెళ్లి గురించి వివరాలను బయటపెట్టేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RH2FmN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...