Friday, 14 May 2021

మళ్లీ అదే డైరెక్టర్‌తో రీ ఎంట్రీకి రెడీ అయిన ప్రభాస్ హీరోయిన్.. ఈసారైన కలిసోస్తుందా?

సుకుమార్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వన్‌ నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. కృతి నటనకు మాత్రం మంచి మార్కులేపడ్డాయి. అయితే ఆమెకు తెలుగులో ఊహించినంత సక్సెస్ లభించలేదు. మహేశ్‌తో సినిమా తర్వాత నాగచైతన్యతో ‘దోచేయ్’ అనే సినిమాలో ఈ పొడుగుకాళ్ల సుందరి నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. మరోవైపు కృతికి బాలీవుడ్‌ నుంచి పెద్ద ఎత్తున ఆఫర్లు వచ్చింది. దీంతో ఆమె ముంబైకే తన మకాంను మార్చింది. బాలీవుడ్‌లో టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన ‘హీరోపంతి’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతికి అక్కడ మంచి సక్సెస్ లభించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ.. అసలు దక్షిన సినీ పరిశ్రమ వైపు చూడటమే మానేసింది. ప్రస్తుతం హీరోగా.. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘’లో కృతి సీత పాత్రలో నటిస్తోంది. దీంతో పాటు బాలీవుడ్‌లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టు చేస్తుంది. అయితే త్వరలో కృతి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనుందని టాక్ బలంగా వినిపిస్తోంది. కృతిని వెండితెరకి పరిచయం చేసిన .. మళ్లీ ఆమె తెలుగు రీఎంట్రీని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్న సుకుమార్.. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఒక సినిమా, రామ్ చరణ్‌తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఒకదాంట్లో హీరోయిన్‌గా చేయాలని సుకుమర్ కృతిని కోరినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె సుక్కు ప్రపోజల్‌కి ఓకే చెప్పినట్లు టాక్. మరి ఆదిపురష్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారనున్న కృతికి.. టాలీవుడ్ రీఎంట్రీ కలిసోస్తుందో లేదో చూడాలి మరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eMO95Z
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...