Wednesday, 19 May 2021

అవి తప్పుడు వార్తలు.. ఫిక్స్ అయితే నేనే చెబుతా.. రూమర్లపై బండ్ల గణేష్ క్లారిటీ

ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ సత్తా చాటారు. కోవిడ్ లాంటి పరిస్థితిలోనూ వంద కోట్ల గ్రాస్‌ను రాబట్టి వకీల్ సాబ్ బాక్సాఫీస్ మీద విరుచుకపడ్డాడు. అయితే పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాలన్నీ కూడా వరుసగా లైన్‌లోనే ఉన్నాయి. ఒకదాని వెంట మరోకటి షూటింగ్‌లకు సిద్దంగానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా షూటింగ్‌ల కోసం అడుగు బయటపెట్టడం సాధ్యమయ్యే పని కాదు. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సినిమాలపై అనేక రకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తరువాత హరీష్ శంకర్ మైత్రీ మూవీస్ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా కోసం సిద్దంగా ఉన్నారు. ఆ తరువాత ఓ సినిమాను పవన్ కళ్యాణ్‌తో నిర్మించేందుకు రెడీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ మూవీపై నిత్యం ఏదో రకమైన రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా? లేదా? అనే అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. అయితే సినిమా కచ్చితంగా ఉంటుందని బండ్ల గణేష్ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా మరో రూమర్ బయటకు వచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్ దర్శకుడు ఇతనే అంటూ ఓ వార్త చక్కర్లు కొట్టేసింది. రవితేజ దర్శకుడు రమేష్ వర్మతో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతోన్నాడని, దాన్ని బండ్ల గణేష్ నిర్మించబోతోన్నాడంటూ రూమర్లు వచ్చాయి. వాటిపై బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. అవన్నీ తప్పుడు వార్తలు.. అన్నీ కన్ఫామ్ అయ్యాక నేనే చెబుతాను అంటూ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ గాలివార్త అని తేలిపోయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wjhVFy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...