పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్స్, తిరుపతి ఉప ఎన్నిక సభల్లో పాల్గొంటూ ఎంత బిజీగా తిరిగారో అందరికీ తెలిసిందే. అలా వకీల్ సాబ్ టీంలో కొంత మంది బారినపడ్డారు. అలా పవన్ కళ్యాణ్‌కు సైతం కరోనా సోకింది. గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఫాం హౌస్‌కే పరిమితమయ్యారు. అక్కడే ఇన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌కు చిన్నతనం నుంచి ఉన్న ఆస్తమా వల్ల కరోనా కాస్త తీవ్రతరంగా మారింది. ఆ సమయంలో అభిమానులు అందరూ కూడా ఆందోళన చెందారు. కానీ ప్రస్తుతం వారందరికీ ఓ గుడ్ న్యూస్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు జనసేను పార్టీ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని చెప్పుకొచ్చారు. ‘జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోలుకున్నారు. కరోనా బారిన పడిన పవన్ కళ్యాణ్‌కు మూడు రోజుల క్రితం ఆర్జీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. అందులో నెగెటివ్ వచ్చింది. కరోనా అనంతరం వచ్చే నిస్త్రాణం వంటివి మాత్రం ఉన్నాయని, ఆరోగ్య పరంగా పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపారు. తన ఆరోగ్య క్షేమాల కోసం ఆకాంక్షినవారికి, పూజాలు, ప్రార్థనలు చేసిన జన సైనికులు, నాయకులు, అభిమానులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశార’ని పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3btWauP
v
No comments:
Post a Comment