Thursday, 13 May 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: బీచ్‌లో అదా సెల్ఫీలు.. బెస్టీతో శృతి ఆటలు..ఈషా నవ్వుల నజరానా

బీచ్‌లో అదా శర్మ సెల్ఫీలు ‘హార్ట్‌ అటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ అదా శర్మ.. కెరీర్‌లో పెద్దగా సక్సెస్ సాధించలేదు. అయితే ఈ భామ సోషల్‌మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. విభిన్నంగా ఫోటోలు, వీడియోలు చేస్తూ.. వాటిని అభిమానులుతో పంచుకుంటుంది. తాజా బీచ్‌లో సెల్ఫీలు దిగి వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రేక్షకులను సల్మాన్ రిక్వెస్ట్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాధే’. ఈద్ కానుకగా ఈ సినిమా గురువారం విడుదలైంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. అయితే సినిమా విడుదల సందర్భంగా సల్మాన్ అభిమానులను ఓ రిక్వెస్ట్ చేశాడు. సినిమా తీసేందుకు ఎందరో కష్టపడతారని, ఎంతో ఖర్చు అవుతుందని.. కాబట్టి ఎవరూ కూడా సినిమాని పైరసీలో చూడవద్దని కోరాడు. ప్రియ మిత్రుడితో శృతి ఆటలు ఈ మధ్య ‘క్రాక్’, ‘వకీల్‌సాబ్’ సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది నటి . అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఈ క్రమంలో తన ప్రియ మిత్రుడు శాంతనుతో ఈ లాక్‌డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అంటూ శృతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వాళ్లని వదలండి.. వీళ్లను ప్రేమించండి: లావణ్య అందాల రాక్షసి సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. తాజాగా లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ‘‘మన కంటే గొప్ప ఉండే వాళ్లను వదిలేయండి.. బాధలో ఉన్న వాళ్లని కౌగిలించుకోండి.. మనసు విరిగిపోయిన వారికి ఓ ముద్దు ఇవ్వండి.. కోల్పోయిన వారితో స్నేహం చేయండి.. ఒంటరిగా ఉండేవారిని ప్రేమించండి’’ అనే కోట్‌ని లావణ్య షేర్ చేసింది. ఈషా నవ్వుల నజరానా తెలుగు అమ్మాయి ఈషా రెబ్బాకు సోషల్‌మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు ఫోటోలు పెట్టిందంటే చాలు.. ఫాలోవర్లు తెగ లైకులు, షేర్లు చేస్తుంటారు. తాజాగా ఈషా కింద కూర్చొని, నవ్వులు చిందిస్తూ ఫోటోషూట్ నిర్వహించి.. ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fe4Eab
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...