Saturday, 1 May 2021

కోరమీసాలతో కసి మీదున్నావ్.. వరుణ్ సందేశ్‌పై ధన్ రాజ్.. అదిరిపోయేలా రీ ఎంట్రీ!

వరుణ్ సందేశ్ హీరోగా పలకరించి చాలా కాలమే అయింది. బిగ్ బాస్ షోతో వరుణ్ సందేశ్‌కు బాగానే ఇమేజ్ వచ్చింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయారు. ఒకప్పుడు `హ్యాపీడేస్‌`, `కొత్త బంగారు లోకం` చిత్రాలతో టాలీవుడ్‌ను షేక్ చేసేశారు. `ఏమైంది ఈ వేళా అంటూ రొమాంటిక్ యాంగిల్‌ను చూపించారు. అయితే ఆ తరువాత సరైన హిట్ కొట్టలేకపోయారు. మధ్యలో మల్టీ స్టారర్ చిత్రాల్లోనూ కనిపించి మెప్పించారు. `ఢీ ఫర్‌ దోపిడి`, `మామ మంచు అల్లుడు కంచు` వంటి సినిమాలతో నవ్వించారు. ఇక ఆ తరువాత సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చారు. బిగ్ బాస్ షోతో అందరినీ మెప్పించారు. తెలుగు ప్రేక్షకులకు వరుణ్ సందేశ్ మరింత దగ్గరయ్యారు. వరుణ్ సందేశ్ మళ్లీ ఓ సినిమాతో గట్టిగా రీ ఎంట్రీ ఇవ్వాలని అందరూ ఆశించారు. ఇప్పుడు వరుణ్ సందేశ్ అదే చేయబోతోన్నారు. తన కొత్త సినిమా అప్డేట్‌ను వెరైటీగా రివీల్ చేశారు. ధన్ రాజ్, వరుణ్ సందేశ్ మధ్య జరిగిన ఈ సంభాషణ అందరినీ ఆకట్టుకుంటోంది. కోరమీసాలు పెంచి కసి మీదున్నావ్ అంటూ కామెంట్ చేయడం.. దానికి ఓ కథ ఉందని వరుణ్ సందేశ్ అన్నారు. వరుణ్ సందేశ్ గురించి మాట్లాడుకోవడానికి ఏముంది అని జనాలు మాట్లాడుకుంటున్నారు అని ధన్ రాజ్ అన్నారు. సినిమా ఏది.. చూస్తున్నావా? చేస్తున్నావా? అని వరుణ్ సందేశ్ మీద ధన్ రాజ్ కౌంటర్లు వేశారు. గ్యాప్ వస్తే యూఎస్ వెళ్తా.. మంచి స్క్రిప్ట్ వస్తే ఇండియాలో ఉంటానున అని తెలుసు కదా? అని వరుణ్ సందేశ్ కవర్ చేసుకున్నారు. అలా మొత్తానికి ఆ సంభాషణలో తన కొత్త సినిమా అని టైటిల్‌ను రివీల్ చేశారు. ఇంకో రెండు రోజుల్లో ఫస్ట్ లుక్ రాబోతోందంటూ ప్రకటించారు. మూవీ ఫస్ట్ లుక్‌ అదిరిపోతుందని, ఊహించని విధంగా ఉంటుందని, దీనమ్మ వరుణ్‌ సందేశ్‌ ఏంట్రా ఇలా ఉన్నాడనుకోవాలని, ఆ రేంజ్‌లో ఉంటుందని చెప్పారు. శ్రీ బాలాజీ పిక్చర్స్‌పై రాబోతోన్న ఈ మూవీకి ఎంఎస్‌ఆర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nCNR4x
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...