Thursday, 6 May 2021

సినిమా రౌండప్: పవన్ సినిమాలో నిత్య రోల్.. జగపతిబాబు ఎమోషనల్ కామెంట్స్

విశాల్ న్యూ మూవీ స్టార్ట్ హీరో విశాల్ 31వ సినిమా ప్రారంభమైంది. విభిన్నమైన కథాంశంతో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమాతో టి.పి.శరవణన్‌ అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటిస్తుండగా.. విశాల్ స్వయంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సతీమణి పవన్‌ కళ్యాణ్, రానా హీరోలుగా రూపొందుతున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ సినిమా తెలుగు రీమేక్‌లో నిత్యామీనన్‌ నటిస్తోందని టాక్. అయితే అది పవన్ కళ్యాణ్ భార్య రోల్ అని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. నందమూరి వారసుడి ప్రశంస దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ పరిస్థితుల్లో హిందూపురం నియోజకవర్గంలో అర్షి స్కిన్‌, హెయిర్‌ క్లినిక్‌ యాజమాన్యం మేమున్నామంటూ ముందుకొచ్చింది. కేన్సర్‌ రోగులకు, పేదలకు 30లక్షల రూపాయల విలువ చేసే రోగ నిరోధక మందులు పంపిణీ చేసింది. వీరి సేవలను బాలకృష్ణ ప్రశంసించారు. జగపతిబాబు ఆవేదన కరోనా కారణంగా కళ్ళ ముందే కళ్ళు మూస్తున్నారంటూ జగపతిబాబు ఆవేదన చెందారు. గుంటూరులోని తన అభిమాన సంఘం ప్రెసిడెంట్‌గా ఉన్న శ్రీను మరణ వార్త తెలిసి ఆయన ఎమోషనల్ అయ్యారు. బాలీవుడ్ బ్యూటీతో నాగార్జున రొమాన్స్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'బంగార్రాజు' సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను హీరోయిన్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు ఫినిష్ అయినట్లు టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eqYPXT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...