Friday, 7 May 2021

పోలీసులకు కష్టం కానీ కరోనాకు కాదు.. చోటా రాజన్‌పై కస్తూరి శంకర్ సెటైర్లు

అండర్ వరల్డ్ డాన్ మృతి చెందారంటూ సోషల్ మీడియాలో ఓ గంటపాటు రూమర్లు చక్కర్లు కొట్టేశాయి. కొంత మంది సెలెబ్రిటీలు రాజన్ మరణంపై సెటైర్లు కూడా వేసేశారు.అయితే అవన్నీ రూమర్లేనని, చోటా రాజన్ ఇంకా బతికే ఉన్నారంటూ ఎయిమ్స్ వైద్యులు, ఢిల్లీ పోలీసులు ప్రకటించేశారు. చనిపోయారంటూ వచ్చిన వార్తలను ఖండించారు. అలా మొత్తానికి చోటా రాజన్ మాత్రం మరోసారి వార్తల్లో హల్చల్ చేశారు. చోటా రాజన్ మరణించాడంటూ వచ్చిన వార్తలపై నటి సెటైర్లు వేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శంకర్ నిత్యం ఏదో ఒక టాపిక్ మీద కామెంట్లు చేస్తుంటారు. ఒక్కోసారి కస్తూరి కామెంట్లు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటాయి. రాజకీయ విశ్లేషణలు ఇవ్వడంలో కస్తూరి శంకర్ ముందుంటారు. అలాంటి కస్తూరి తాజాగా చోటా రాజన్ మీద కామెంట్ చేశారు. ముందు అంతా కూడా చోటా రాజన్ మృతి చెందారంటూ వార్తలు వచ్చాయి. కరోనాతో మాఫియా డాన్ మృతి అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఒక్కసారిగా చోటా రాజన్ పేరు ట్రెండ్ అయింది. ఆ సమయంలో కస్తూరి శంకర్ ట్వీట్ వేశారు. డాన్ కో పకడ్నా అంటూ ఓ లెవెల్‌లో డైలాగ్ వేశారు. డాన్‌ను పట్టుకుని మట్టి కరిపించేందుకు పోలీసులకు కష్టతరమైంది కానీ కరోనాకు మాత్రం కాదు.. అండర్ వరల్డ్ డాన్ కరోనాకు బలయ్యాడు అంటూ ట్వీట్ వేశారు. కానీ చోటా రాజన్ ఇంకా బతికే ఉన్నాడని తెలిసిన తరువాత కస్తూరి శంకర్ మరో ట్వీట్ వేశారు. అతను ఇంకా బతికే ఉన్నాడని నేను విన్నాను.. కానీ ఆ ట్వీట్‌ను మాత్రం అలాగే ఉంచేస్తాను.. ఎందుకంటే అదో మంచి పంచ్ లైన్ అంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుతం కస్తూరీ శంకర్ గృహలక్ష్మీ ధారావాహికతో తెలుగు ప్రేక్షకులకు పలకరిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nVYI9S
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...