ప్రస్తుతం దేశంలో కరోనా ఉధృతి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. సెకండ్ వేవ్ ధాటికి ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కరోనా వల్ల పెరుగుతున్న మరణాల రేటు అందరికీ తెలిసిందే. ఇక సినీ ఇండస్ట్రీలోనూ వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. అందులో ఎక్కువగా కరోనా వల్ల మృతి చెందుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. నేడు ఇద్దరు సినీ ప్రముఖులు కరోనాతో మృతి చెందారు. మరొకరు గుండెపోటుతో మృతి చెందారు. చిరంజీవి సినిమాతో పరిచయమైన సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్.. 2000 సినిమాలకు పైగా డబ్బింగ్ ఇంఛార్జ్ గా పని చేసిన కాంచన్ బాబు.. అంతరంగాలు లాంటి సీరియల్ డైరెక్ట్ చేసిన దాసరి నారాయణ రావు శిష్యుడు, దర్శకుడు అక్కినేని వినయ్ కుమార్ ఒకేరోజు మరణించారు. వీరి మరణాలతో ఇండస్ట్రీ విషాదంలో మునిగింది. కాంచన్ బాబు, కరోనాతో కన్నుమూశారు. ఏడంతస్తుల మేడ సినిమా నుంచి దాసరి నారాయణరావు దగ్గర శిష్యరికం చేసి పవిత్ర సినిమాతో దర్శకుడిగా మారిన అక్కినేని వినయ్ కుమార్ కరోనాతో చనిపోయారు. ఈయన వయసు 65 ఏళ్లు. వెండితెరపై కంటే ఎక్కువగా బుల్లితెరపైనే ఆదరణ దక్కించుకున్నారు. అలా బుల్లితెరపై అంతరంగాలు, నా మొగుడు నాకే సొంతం, అమ్మ, ఆరాధన వంటి పలు సీరియల్స్‌కి వినయ్ కుమార్ దర్శకత్వం వహించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o8ZZur
v
No comments:
Post a Comment