Saturday, 8 May 2021

మరోసారి వార్తల్లోకి ‘కంబాలపల్లి కథలు’.. అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు!

కంబాలపల్ల కథలు అంటూ మెయిల్ చాప్టర్ 1 అంటూ వచ్చిన సినిమా ఓటీటీలో మంచి ఆదరణను దక్కించుకుంది.ఆహాలో గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంది. కంప్యూటర్ అనేది అప్పుడప్పుడే పరిచయం అవుతున్న సమయం.. ఓ పల్లెటూరిలో జరిగిన ఘటనలను సహజత్వానికి దగ్గర తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. స్వప్నా మూవీస్ బ్యానర్‌లో ప్రియాంక దత్ నిర్మించిన మెయిల్ చాప్టర్ వన్ అందరినీ ఆకట్టుకుంది. ఇక కంబాలపల్లిలో తదుపరి ఏం జరుగుతుందా? రెండో చాప్టర్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్న సినీ ప్రేమికులు చిత్రయూనిట్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సెలెక్ట్ అయింది. ఈ క్రమంలో చిత్రయూనిట్ తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఏ బ్యూటీఫుల్ మూమెంట్ ఆఫ్ మెయిల్ అంటూ దర్శకుడు తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా తనను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలైన ప్రియాంక దత్, స్వప్నా దత్‌లకు థ్యాంక్స్ చెప్పారు. అంతే కాకుండా సినిమాలో నటించిన నటీనటులందరికీ, సాంకేతిక బృందానికి థ్యాంక్స్ చెప్పారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఈ ప్రపంచానికి హ్యాపీ మెయిల్ పంపుతున్నాం. జూన్ 4నుంచి ప్రారంభం కాబోతోన్న న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెయిల్ సినిమా ప్రసారం కాబోతోందని స్వప్నా సినిమా ప్రకటించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bespOp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...