Sunday, 9 May 2021

ప్రియుడి కుటుంబానికి షాకిచ్చిన నయనతార.. పెళ్లి విషయంలో కీలక నిర్ణయం! తప్పని పరిస్థితుల్లో..

నయనతార.. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్‌గా పిలవబడుతున్న ఈ బ్యూటీ తన సినిమాలతో ఎంత ఫేమస్ అయిందో లవ్ ట్రాక్స్, పెళ్లి సంగతులతో అంతకుమించి జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది. సోషల్ మీడియాలో నయన్ పెళ్లి మ్యాటర్ ఎప్పుడూ హాట్ టాపికే. ప్రేమ, పెళ్లి విషయాల్లో ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు అలాంటివి. డేటింగ్ చేయడంలో అపార అనుభవమున్న .. తాజాగా తన ప్రియుడి కుటుంబానికి షాకిచ్చే డిసీజన్ తీసుకుందని తెలుస్తోంది. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో గత ఐదేళ్లుగా ప్రేమాయణం నడిపిస్తోంది నయన్. పెళ్లికి ముందే భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ హల్చల్ చేస్తోంది ఈ జోడీ. దీంతో వీళ్లిద్దరి డేటింగ్, పెళ్లిపై ఎన్నో వార్తలు షికారు చేశాయి. ఒకనొక సందర్భంలో ఈ జంట విడిపోయిందన్న టాక్ కూడా నడిచింది కానీ.. రీసెంట్‌గా తన ప్రియుడు విఘ్నేష్‌ శివన్ గుండెల మీద చేయి వేసి దిగిన ఓ పిక్ షేర్ చేస్తూ చేతికి ఉన్న రింగ్ అందరికీ చూపించింది నయనతార. అది చూసి వీరి ఎంగేజ్‌మెంట్ అయిందని, త్వరలోనే బాజాబజంత్రీ మోగనుందనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి విషయమై నయన్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ ఏడాది ఎలాగైనా వివాహం చేసుకోవాలని విఘ్నేష్ శివన్‌‌తో పాటు ఆయన ఫ్యామిలీ ఫిక్స్ అయ్యారట. కానీ నయన్ మాత్రం అందుకు సిద్ధంగా లేదని, కరోనా ఎఫెక్ట్ తగ్గాక వచ్చే ఏడాది వరకు పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిందని కోలీవుడ్ వర్గాల్లో నడుస్తున్న టాక్. పెళ్లి వాయిదా వేసుకుందామనే విషయాన్ని ఆమె విఘ్నేష్ కుటుంబంతో చెప్పిందని, విఘ్నేష్ కూడా అందుకు ఓకే చెప్పాడని అంటున్నారు. సో.. అంతా అనుకున్నట్లు ఈ ఏడాది ఉండకపోవచ్చనే టాక్ ముదిరింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Q2CPJr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...