మెగా కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయమైన .. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. విభిన్నమైన సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్3’ సినిమాలో నటిస్తున్న వరుణ్.. దాంతో పాటు డైరక్షన్‌లో ‘’ అనే సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సైయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు బాబీ, సిద్ధు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కథ విషయంలో వరుణ్ తేజ్ సంతృప్తిగా లేడని.. అందుకే సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని అతను దర్శకుడిని డిమాండ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపించాయి. అంతేకాక.. నిర్మాతల మధ్య విబేధాలు ఏర్పడ్డాయని.. దాంతో సినిమా షూటింగ్ నిలిచిపోయిందంటూ వార్తలు వచ్చాయి. అయితే వీటిపై దర్శకుడు కిరణ్ లేటెస్ట్‌గా క్లారిటీ ఇచ్చారు. వరుణ్ విషయంలో వచ్చిన ప్రతీ వార్త అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. హీరో చేతికి గాయం అయిన కారణంగా షూటింగ్ ఆపేశామని స్పష్టం చేసిన ఆయన.. వరుణ్ సినిమా కథ విషయంలో జోక్యం చేసుకుంటున్నాడనే వార్తలను ఖండించారు. ఇక కరోనా సెకండ్ వేవ్, విదేశీ ఫైట్ మాస్టర్లు అందుబాటులో లేకపోవడం కూడా సినిమా ఆగిపోవడానికి కారణాలు అని ఆయన పేర్కొన్నారు. అంతే తప్ప హీరోతో తనకు ఎలాంటి విబేధాలు లేవని తెలిపారు. సినిమాలో ఒక మేజర్ యాక్షన్ సీన్, టాకీ మినహా మిగితా షూటింగ్ అంతా పూర్తయిందని అన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3w4xd0x
v
No comments:
Post a Comment